ముందు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తీర్పు
నవంబర్ 8న బెయిలు పై విచారణ
ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిలు పిటీషన్ పై విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణను నవంబర్ 8 కి వాయిదా వేశారు. శుక్రవారం ఉదయం సుప్రీం కోర్టులో ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిలు పై విచారణ జరగాల్సి ఉంది. చంద్రబాబు తరుపున సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లూద్రా వాదనలు వినిపించేందుకు సిద్దమయ్యారు. అయితే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ముందుగా తీర్పునిస్తామని ,అందుచేత ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిలు పై విచారణను వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి చంద్రబాబు తరపు న్యాయవాదులకు వెల్లడించారు. అందుకు చంద్రబాబు తరపు న్యాయవాదులు అంగీకరించడంతో తదుపరి విచారణను నవంబర్ 8కు వాయిడ్ వేశారు.ఈ కేసులో పిటి వారెంటు పై యధాతథ స్థితి ని కొనసాగించాలని సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చింది.
