తెలంగాణలో కాంగ్రెస్ కు బేషరతుగా మద్దతు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ నుండి వైదొలుగుతున్నట్లు వై ఎస్ షర్మిల ప్రకటించారు. ఈ ఎన్నికల్లో అధికార బి ఆర్ ఎస్ వ్యతిరేఖ ఓటు చీలకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. దేశంలోనే అతి పెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. అన్ని నియోజక వర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు తమ పార్టీ కార్యకర్తలు మద్దతునిస్తారనే ఆశాభావం వ్యక్తం చేసారు. తాను తీసుకున్న నిర్ణయం తమ పార్టీ లోని కార్యకర్తలందరూ అర్ధం చేసుకుంటారని చెప్పారు. షర్మిల చేసిన ప్రకటనతో గత కొంత కాలంగా పార్టీ విలీనం,పోటీ పై నెలకొన్న సస్పెన్స్ కు తెరపడింది. గత కొన్ని నెలలుగా వై ఎస్సార్ టీపీ ని కాంగ్రెస్ లో విలీనం చేయాలనీ ప్రయత్నాలు జరిగాయి.