
మాదకద్రవ్యాలు జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది – ఈగల్ ఐజీ ఆకే రవి కృష్ణ.
తెలుగు ట్రాక్, గుంటూరు
జీవితం చాలా అమూల్యమైనదని, మాదకద్రవ్యాలు (డ్రగ్స్) వంటి తప్పు జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తుందని ఈగల్ ఐజి ఆకే రవి కృష్ణ హెచ్చరించారు. ఆదివారం అడవి తక్కెలపాడు లోని టిడ్కో గృహ సముదాయం సమీపంలో ‘‘ఫిట్ ఇండియా’’ కార్యక్రమ స్పూర్తితో మాదక ద్రవ్య సమాజ నిర్మాణమే ‘‘సంకల్పం (గుంటూరు జిల్లా పోలీస్)’’ గా మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే దుష్ప్రభావాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి ‘‘డ్రగ్స్ వద్దు బ్రో – సైకిల్ తొక్కు బ్రో (ఈగల్)’’ అనే సైకిల్ ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈగల్ ఐజి ఆకే రవి కృష్ణ, జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్ధాలు, అరికట్టడానికి అమల్లో ఉన్న కఠిన చట్టాలను తెలియజేస్తూ రూపొందించిన ప్లే కార్డులు, స్లోగన్లు, పాటలు ప్రదర్శిస్తూ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ సమీపంలోని టిడ్కో గృహాల వద్ద నుండి ప్రారంభమై స్వర్ణ భారతి నగర్, %జీఖజ% కాలేజీ రోడ్డు, గుజ్జనగుండ్ల సర్కిల్, స్వామి థియేటర్ సెంటర్, %ుజీూూ% కాలేజీ, పట్టాభిపురం ఫ్లై ఓవర్ మీదుగా జిల్లా పోలీస్ పరేడ్ మైదానం వరకు కొనసాగింది. టిడ్కో గృహ సముదాయాలు, స్వర్ణ భారతి నగర్, టిజెపిఎస్ కాలేజ్ సెంటర్లలో ప్రజలకు, యువత, విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ సమావేశాలు నిర్వహించి, ప్రచార పోస్టర్లను ఆవిష్కరించి, పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఈగల్ ఐజి ఆకే రవి కృష్ణ మాట్లాడుతూ అవగాహన లేకుండా సరదా కోసం, స్నేహం కోసం మాదకద్రవ్యాలకు అలవాటు పడి ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్థులు, యువత జైలు పాలవుతున్నారని వారి కుటుంబాలు ఆవేదనకు గురవుతున్నారని చెప్పారు. మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడానికి ఏర్పాటుచేసిన ఎన్ డి పి ఎస్ చట్టం చాలా కఠినమైనదని, ఒక్కసారి డ్రగ్స్ వినియోగిస్తూ పట్టుబడితే 10 నుంచి 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తారన్నారు. ఉద్యోగ అవకాశాలు కోల్పోతారని, విదేశాలకు వెళ్లలేరని, వారి జీవితాంతం దేశంలో ఎక్కడ ఉన్న పోలీసులు నిఘా పెట్టి కొద్దిపాటి అనుమానం ఉన్న తిరిగి జైలుకు పంపుతారని వివరించారు. అవగాహన లేక డ్రగ్స్ కు అలవాటు పడి జైలు పాలైన పలువురి విద్యార్థులు, యువత విషాదగాధలను తెలియజేశారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాలను అరికట్టడం అవగాహన కల్పిస్తున్న ఈగల్ విభాగంలో ప్రతి ఒక్కరు సభ్యులే అన్నారు. ముఖ్యంగా ప్రతి అమ్మ మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన కల్పించడంలో ఈగల్ కు బ్రాండ్ అంబాసిడర్ అన్నారు. విద్యార్థులు, యువత తాత్కాలిక ఆనందం కోసం డ్రగ్స్ వినియోగానికి ఆకర్షణ కాకుండా తల్లులు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. మాదకద్రవ్యాలు దేశభద్రత సంబంధించిన అంశమని, దేశాన్ని ప్రేమించే వారు డ్రగ్స్ ను వినియోగించరని తెలిపారు. ప్రస్తుతం దేశానికి పొరుగున ఉన్న కొన్ని దేశాలు నార్కోటిక్ టెర్రరిజం ద్వారా దేశంలో అలజడులు సృష్టించి అంతర్గతంగా బలహీన పరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారన్నారు. డ్రగ్స్ కొనుగోలు వల్ల చెల్లించే ఆదాయంలో ఎక్కువ భాగం టెర్రరిస్ట్ గ్రూపులు అసాంఘిక కార్యక్రమాల నిర్వహణకు అందుతుందన్నారు.. జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ మాదకద్రవ్యాలకు ఎక్కువుగా ఆకర్షితులు అవటానికి అవకాశం ఉన్న విద్యార్థులు, యువత లక్ష్యంగా డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనార్ధాలు పై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. సరదాగా డ్రగ్స్ ను వినియోగిస్తే వారికి తెలియకుండానే అది వ్యసనంగా మారే ప్రమాదం ఉందన్నారు. అందువలన డ్రగ్స్ కు అలవాటు పడకుండా ముందస్తుగానే ప్రజలకు ముఖ్యంగా విద్యార్థులు, యువతకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. మంచి శారీరక దారుఢ్యం వలన మనసు ప్రశాంతంగా ఉండి డ్రగ్స్ వంటి వ్యసనాలకు దూరంగా ఉండే అవకాశం ఉందన్నారు. అందువలన యువత సైకిల్ తొక్కే వ్యాయామాన్ని నిరంతరం కొనసాగించాలన్నారు. జిల్లా పోలీస్ శాఖ మాదక ద్రవ్యాలపై అవగాహన కోసం నిర్వహిస్తున్న సంకల్పం కార్యక్రమంకు జిల్లా యంత్రాంగం తరపున అవసరమైన పూర్తి సహకారం అందిస్తామన్నారు. జిల్లా ఎస్పీ వకూల్ జిందాలు మాట్లాడుతూ మాదకద్రవ్యాలు వినియోగం, విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆకతాయి తనంగా, కిక్ కోసం తీసుకునే ఈ గంజాయి, మాదక ద్రవ్యాలు మరణానికి తీసుకెళ్తాయని, స్నేహితులు, సహచరులు అడిగారని, ఒత్తిడి నుండి బయటకు రావాలని ఈ డ్రగ్స్ కి అలవాటు పడితే క్రమంగా అది మిమ్మల్ని బానిసలుగా మార్చి, మీ జీవితాలను చిత్తు చేస్తాయని కావున జాగ్రత్త వహించాలన్నారు. గుంటూరు నగర వీధుల్లో ఒక ప్రవాహంలా సాగిన ఈ ‘‘డ్రగ్స్ వద్దు బ్రో – సైకిల్ తొక్కు బ్రో’’ సైకిల్ ర్యాలీ కార్యక్రమం ప్రజలందరికీ మాదక ద్రవ్యాల దుష్ప్రభావాల గురించి ఒక మేల్కొల్పులా సాగింది.పెద్ద ఎత్తున విద్యార్థులు, ప్రజలు, సైక్లిస్టులు, పోలీసులు సుమారు 500 మంది ఈ ర్యాలీలో పాల్గొనగా ప్రజల నుండి విశేష స్పందన లభించింది.ఈ కార్యక్రమంలో ఈగల్ ఎస్పి కేఎం మహేశ్వరరావు, అడిషనల్ ఎస్పి కె నగేష్ బాబు. జిల్లా పంచాయతీ అధికారి సాయికుమార్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ నజీమ బేగం స్థానిక గురుకుల పాఠశాల, మాస్టర్ మైండ్స్ కళాశాల,ఎన్ సిసి విద్యార్థులు, స్థానిక ప్రజలు, పోలీస్ అధికారులు,సిబ్బంది సుమారు 500 మంది పాల్గొన్నారు
