తెలుగు ట్రాక్ ,అమరావతి, జనవరి 07: పోలవరం ప్రాజెక్టును ఏదో ప్రాంతానికి పరిమితమైన ప్రాజెక్టుగా చూడకూడదని… ఈ ప్రాజెక్టు తెలుగు జాతికి నెర్వ్ సెంటర్ లాంటిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. బుధవారం సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు సైట్ మొత్తం పర్యటించారు.. ఈ సందర్భంగా నిర్మాణంలో ఉన్న టన్నెళ్లను.. డయాఫ్రం వాల్, ఈసీఆర్‌ఎఫ్ డ్యాం పనులను పరిశీలించారు. ప్రాజెక్టు సైటులో అధికారులు ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ సందర్శించారు. నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయోననే అంశాన్ని క్షత్ర స్థాయిలో పర్యటించిన అనంతరం ముఖ్యమంత్రి ఇరిగేషన్ శాఖ అధికారులు, కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు అధికారులకు, కాంట్రాక్టు సంస్థకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో వివిధ సూచనలు చేశారు. అనుకున్న సమయానికంటే ముందుగానే పోలవరం నిర్మాణ పనులు పూర్తి చేసి జాతికి అంకితం చేసేలా ప్రణాళికలు సిద్దం చేయాలని ఆదేశించారు. అనంతరం సీఎం చంద్రబాబు విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…’’వీలైనంత త్వరగా పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తాం. గతంలోనే డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తై ఉంటే… రూ.440 కోట్లతోనే నిర్మాణం జరిగేది. ప్రాజెక్టు కూడా త్వరితగతిన పూర్తి అయ్యేది. 2019లో ప్రభుత్వం మారాక పోలవరం ప్రాజెక్టుకు చాలా నష్టం జరిగిందన్నారు. . డయాఫ్రం వాల్ దెబ్బతిన్నా కూడా నాటి ప్రభుత్వం దానిని గుర్తించడానికి చాలా సమయం తీసుకుందన్నారు. . గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడానికి ఆరేడేళ్లు జాప్యం అయిందని అన్నారు. జాప్యం కావడం వల్ల ఖర్చులు పెరిగాయి. డయాఫ్రం వాల్ నిర్మాణానికి అదనంగా రూ.1000 కోట్ల భారం పడిరదని తెలిపారు. వచ్చే ఫిబ్రవరి 15 నాటికి డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. . పోలవరం మెయిన్ డ్యాం దాదాపు పూర్తి అయింది. ఎంబాంక్‌మెంట్ పనులు ఈ ఏడాది జూన్ నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈసీఆర్‌ఎఫ్ డ్యాం గ్యాప్-2 పనులను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని ఆదేశించాం. ఇక పోలవరం ప్రాజెక్టులో ప్రధాన పనులను అన్నింటినీ వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకువస్తాం. వినియోగంలోకి తెచ్చే ప్రయత్నం చేస్తాం.’’ అని ముఖ్యమంత్రి చెప్పారు
కలను సాకారం చేస్తున్నాం
