దళిత క్రైస్తవ్యం చుట్టూ రాజకీయం

Telugu Track
Spread the love

తెలుగు ట్రాక్,విజయవాడ:


ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత ఎన్నికల ముగింపు తర్వాత కూడా తెరవెనుక సవిÖకరణాలు అత్యంత వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో సుమారు 15% నుండి 18% వరకు బలంగా ఉంటూ, దశాబ్ద కాలంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత నమ్మకమైన, సహజ సిద్ధమైన ఓటు బ్యాంక్‌గా ఉన్న దళిత క్రైస్తవ సామాజికవర్గం చుట్టూ ఇప్పుడు సరికొత్త రాజకీయ చదరంగం నడుస్తోంది. మొన్నటివరకు జగన్ మోహన్ రెడ్డికి ఏకపక్షంగా అండగా నిలిచిన ఈ వర్గానికి తానే ఏకైక లీడర్నని, రక్షకుడినని చెప్పుకుంటూ జై భీమ్ భారత్ పార్టీ అధినేత, లాయర్ జడ శ్రవణ్ కుమార్ రంగంలోకి దిగారు. గత ఎన్నికల్లో మంగళగిరితో పాటు పలు స్థానాల్లో సొంతంగా అభ్యర్థులను నిలబెట్టి ఓట్లు చీల్చిన శ్రవణ్.. ఇప్పుడు ఏకంగా తానే దళిత క్రైస్తవుల ప్రత్యామ్నాయ డిప్యూటీ సీఎం అనే రేంజ్‌లో బిల్డప్ ఇస్తూ చేస్తున్న రాజకీయం ఢిల్లీ స్థాయి దాకా చర్చనీయాంశమైంది.రాజకీయ నిపుణుల లోతైన విశ్లేషణ ప్రకారం.. జడ శ్రవణ్ కుమార్‌కు అత్యంత స్పష్టమైన, సుదూర రాజకీయ లక్ష్యాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవుల నిరసన సభలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తూ ఆయన చేసిన తీవ్రమైన వ్యాఖ్యలు దీనికి స్పష్టమైన ఉదాహరణ. పవన్ కల్యాణ్ కాపు సామాజికవర్గానికి డిప్యూటీ సీఎం అయితే.. నేను దళిత క్రైస్తవ సామాజికవర్గానికి డిప్యూటీ సీఎంను అనే తరహాలో శ్రవణ్ క్లెయిమ్ చేసుకోవడం వెనుక.. జగన్ మోహన్ రెడ్డి ఇమేజ్‌ను పక్కనబెట్టి, సదరు ఓటు బ్యాంక్‌ను తన స్వంత అకౌంట్‌లోకి మార్చుకోవాలనే మైండ్ గేమ్ స్పష్టంగా కనిపిస్తోంది. అదే సమయంలో జోసఫ్ రావణ్‌కు మద్దతుగా జడ శ్రవణ్ పని చేశారు. ఇక్కడే వైసీపీ ఊహించని పెద్ద పొలిటికల్ షాక్ తగలనుంది. జోసఫ్ రావణ్, జడ శ్రవణ్ కుమార్ వంటి వారు పవన్ కల్యాణ్‌ను, కూటమి ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తుంటే.. వైసీపీ అనుకూల విÖడియా వీరికి విపరీతమైన కవరేజ్ ఇస్తూ ప్రమోట్ చేస్తోంది. కూటమిని ఇబ్బంది పెట్టడానికి వీరు పనికొస్తారని జగన్ మోహన్ రెడ్డి భావిస్తుండవచ్చు. కానీ, పొలిటికల్ ఎక్స్‌పర్ట్స్ హెచ్చరిస్తున్న నిజం ఏంటంటే.. వీరిని ఎంతగా ప్రోత్సహిస్తే అంతగా వైకాపాకే భారీ నష్టం వాటిల్లుతుంది. ఎందుకంటే, దళిత క్రైస్తవ సమాజంలో ఒక కొత్త లీడర్‌గా జడ శ్రవణ్ కుమార్ ఎస్టాబ్లిష్ అయితే.. మొదట ఖాళీ అయ్యేది వైసీపీ ఓటు బ్యాంక్ అని గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో దళిత, మైనారిటీ వర్గాలు వైసీపీ ఐదేళ్ల పాలనలో తమకు జరిగిన అన్యాయాలు, నిధుల మళ్లింపుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నాయని గత ఎన్నికలు నిరూపించాయి. జగన్ మోహన్ రెడ్డి కేవలం ఓట్ల కోసమే తమను వాడుకున్నారనే భావన క్రైస్తవ పెద్దలలో బలంగా నాటుకుంటోంది. అందుకే గత ఎన్నికల్లో కొంత మంది కాంగ్రెస్ కు ఓటు వేశారు. ఇలాంటి తరుణంలో జడ శ్రవణ్ కుమార్ రూపంలో ఒక దూకుడున్న దళిత న్యాయవాది, క్రైస్తవ హక్కుల రక్షకుడిగా ప్రచారం పొందితే.. ఆ వర్గాల యువత వైసీపీని వదిలేసి జై భీమ్ భారత్ పార్టీ వైపు మళ్లే అవకాశాలు 100 శాతం ఉన్నాయి. అంటే, కూటమిని దెబ్బతీయడానికి వాడుతున్న ఆయుధమే.. చివరికి వైసీపీ పునాదులనే తవ్వేసే ప్రమాదం ఉంది.వైసీపీ అనుసరిస్తున్న ఈ విధానం కచ్చితంగా భస్మాసుర హస్తం లాంటిదేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జోసఫ్ రావణ్ అరెస్ట్‌ను, ఉపా కేసులను బూచిగా చూపిస్తూ జడ శ్రవణ్ కుమార్ చేస్తున్న సెంటిమెంట్ పాలిటిక్స్ వల్ల.. వైసీపీ తన సొంత ఓటు బ్యాంక్‌పై నియంత్రణ కోల్పోతోంది. పవన్ కల్యాణ్ ఐడెంటిటీని ఎదుర్కొనే క్రమంలో, వైసీపీకి ప్రత్యామ్నాయంగా దళిత క్రైస్తవ సమాజానికి జడ శ్రవణ్‌ను లీడర్‌గా మార్చే ఈ వ్యూహం.. రాబోయే 2029 ఎన్నికల నాటికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆయా సామాజికవర్గాల్లో మూడో స్థానానికి పడిపోయేలా చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *