స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రం లో శనివారం మైలవరం, జగ్గయ్యపేట, నందిగామ నియోజక వర్గ మైక్రో అబ్జర్వర్ల పరిచయ మరియు అవగాహన సమావేశం ను
మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజక వర్గాల సాధారణ పరిశీలకులు నరేందర్ సింగ్ బాలి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైక్రో ఆబర్వర్ లు పోలింగ్ సమయం కన్నా 90 నిమిషాలు ముందు అనగా ఉదయం 5.30 కి చేరుకుని మాక్ పోల్ ని అబ్జర్వ్ చేయాలని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో శాంతియుతం గా పోలింగ్ నిర్వహించటం లో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమైనది అని. పోలింగ్ కేంద్రాలలో వసతులు పరిశీలించాలి అని పోలింగ్ సమయంలో ఏమైనా ఇబ్బంది కలిగినచో ఆర్వోను గాని, పరిశీలకులకు తెలియచేయాలని, పోలింగ్ ముగిసిన తర్వాత వారి రిపోర్ట్ ను తప్పనిసరిగా నిర్ణీత ప్రొఫార్మా లో సమర్పించాలని తెలియచేసారు. ఈ సందర్భంగా మైక్రో అబ్జర్వర్ లు లేవనెత్తిన సందేహాలకు సమాధానాలను తెలియచేసారు.
ఈ కార్యక్రమం లో మైక్రో అబ్సర్వర్ల నోడల్ ఆఫీసర్ ఆరోగ్య శ్రీ కోఆర్డినేటర్ సుమన్, ఎల్ డి ఎం ప్రియాంక పాల్గొన్నారు.
ఎన్నికల్లో పోలింగ్ రోజున అబర్వర్లే కీలకం..
