అమరావతి నేతకు గుర్తింపు దక్కేనా?

Spread the love

ప్రజా రాజధాని అమరావతి ఉద్యమ నాయకులు పోతుల బాలకోటయ్యను
కూటమి ప్రభుత్వం గుర్తిస్తోందా? గుర్తించదా?
పార్టీలలో ఉన్న వారికే పదవు లా?
ప్రజా ఉద్యమంలో ఉన్న వారికి ఏమీ ఉండవా?
అన్నది రాష్ట్రంలో పెద్ద చర్చకు తెరలేపింది. ఇందుకు ప్రధాన కారణం అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్యకు కూటమి ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఎలాంటి న్యాయం జరగకపో వడం చర్చకు ప్రధాన కారణం.
ప్రజా రాజధాని అమరావతి ఉద్యమంలో బాలకోటయ్య అంటే తెలియని వారు ఉండరు. రాజధానిలో బహుజన కులాల గొంతుక కోసం పోరాడారు. ఎస్సీ ఎస్టీలు ఇచ్చిన 32 శాతం భూముల వివరాలను ప్రజలకు తెలియజేశారు. హైకోర్టులోను క్రింది కులాల తరఫున కేసులు వేశారు. చంద్రబాబు అరెస్టు సమయంలో బాలకోటయ్య చేసిన పోరాటం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఉత్తేజం అనే చెప్పాలి.
రాష్ట్రంలో బాలకోటయ్యపై పెద్ద చర్చ

విజయవాడ, (తెలుగు ట్రాక్‌)

ఆయన పోరాట పటిమ, వాగ్ధాటి అందరికీ తెలిసిందే. గత ఐదేళ్ళు మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికి ఊపిరి ఆడనివ్వలేదు అంటే అతిశయోక్తి కాదు, అమరావతిపై ప్రభుత్వం కమ్మ కుల ముద్ర వేసి దాడి చేసిన నేపథ్యంలో దళిత కులాల ప్రతినిధిగా బాలకోటయ్య రాజధాని ఉద్యమంలోకి వచ్చారు. కమ్మ కుల ముద్ర దాడిని తిప్పికొట్టారు. ఏ రాజకీయ పార్టీ అండలేకుండా అంబేద్కర్‌ ఐడియాలజీతోనే ఆయన తన పోరాట పంథాను కొనసాగించారు. బెదిరింపులకు, హౌస్‌ అరెస్టులకు గురయ్యారు. నిజానికి బాలకోటయ్యకు ఎమ్మెల్యే టికెట్‌ వస్తోందని చాలా మంది అభిప్రాయపడ్డారు. కానీ రాలేదు. ఆయన
ప్రజా ఉద్యయంలో ఉన్న బాల కోటయ్యకి సంఫీుభావం తెలుపుతున్న నాయకుడు..
నందిగామ అసెంబ్లీ రిజర్వుడు నియోజకవర్గం ఐనా ఎందుకో ఇవ్వలేదు. వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు వసంత కృష్ణ ప్రసాద్‌,
కొలుసు పార్థసారథి వంటి వారికి తెలుగుదేశం పార్టీ పిలిచి సీట్లు ఇచ్చిన విషయం దాచేస్తే దాగని సత్యం. పోనీ, ఎమ్మెల్సీ ఇస్తారేమో అనే అభిప్రాయం చాలా మందిలో వ్యక్తం అయ్యింది. రెండు ఎమ్మె ల్సీ స్థానాలు ఖాళీ ఐనా బాలకోటయ్యకు రాలేదు. ఇప్పుడు నామినే టెడ్‌ పోస్టు చైర్మన్‌ పదవినైనా ఇస్తారా? అంటే దానిపై కూడా ఆశలు కనిపించటం లేదు. ఎందుకంటే, మొదటి జాబితాలో 29 మంది, రెండవ జాబితాలో 59 మంది మొత్తం 90 మందికి నామినేటెడ్‌ ఛైర్మన్‌ పోస్టులు ఇచ్చినా, బాలకోటయ్యను అదృష్టం వరించలేదు. మళ్ళీ మూడవ లిస్ట్‌ అంటున్నారు. ఇలాంటి పోరాటం చేసే వ్యక్తుల కు న్యాయం జరగక పోవడం కూటమి ప్రభుత్వానికి మాయని మచ్చ గా ఉంటుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు మార్క్‌ పాలనలో కొత్తదనం కోరుకునే వారికి బాలకోటయ్య అంశం గుర్తుకు వస్తే, మళ్ళీ యథా రాజ, తథా ప్రజ అన్నట్లుగానే అనిపిస్తోంది. తెలుగు నేల చరిత్రలో సువర్ణ లిఖిత అధ్యాయంగా నిలిచిన అమరా వతి ఉద్యమ నేతకు న్యాయం జరుగక పోతే, ప్రజల్లో, ముఖ్యంగా దళిత కులాల్లో ఎలాంటి సంకేతాలు వెళతాయో అన్న ఆందోళన సీనియర్‌ తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఉంది. ఏదేమైనా బాలకోట య్యకు రాజకీయ న్యాయం జరుగకపోతే, కూటమి పరిపాలనకు సామాజిక న్యాయం అనే అంశాన్ని తెరపైకి తేలేదు అన్న అభిప్రా యాన్ని కొందరు నాయకులు బహిరంగంగానే వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలాంటి వ్యక్తులను గుర్తిస్తారా? లేదాభ అన్నది కాలమే సమాధానం చెప్పాలి. ఏం జరుగుతుందో, ఏమో వేచి చూద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: