ఐఏఎస్‌ అధికారికి వేధింపులు

Spread the love

వేధింపులు సాధారణ మహిళలకే కాదు ఉన్నత స్థానాల్లో ఉన్నవారికి కూడా సర్వసాధారణం. కొద్ది నెలల క్రితం డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్న ఆనంద్‌కుమార్‌ హైదరాబాద్‌లోని ఐఏఎస్‌ అధికారిణి స్మితా సబర్వాల్‌ ఇంట్లోకి చొరబడ్డాడు. ఈ ఘటన మరువకముందే హైదరాబాద్‌లో మరో మహిళా ఐఏఎస్‌ కూడా వేధింపులకు గురికావడం షాకింగ్‌గా మారింది. ఈ ఘటనపై మహిళ ఐఏఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చాయి. అధికారులు షాక్‌ కు గురయ్యారు. ఇలా మహిళా ఐఏఎస్‌ పోలీసులపై వేధించడ సర్వసాధారణంగా మారుతుందని. వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఉన్నతాధికారులు తెలిపారు.బాధిత ఐఏఎస్‌ సికింద్రాబాద్‌ ప్రాంతంలోని ఓ ప్రభుత్వ శాఖలో డైరెక్టర్‌గా ఉన్నారు. అయితే ఆమెను కలవాలని శివప్రసాద్‌ అనే వ్యక్తి కొంతకాలంగా ప్రయత్నిస్తున్నాడు. తాను మహిళా ఐఏఎస్‌కి వీరాభిమానిని అని పేర్కొంటూ, సోషల్‌ విూడియాలో కూడా ఆమెను ఫాలో అవుతున్నట్లు పేర్కొంది.

గత నెల 22న కూడా మహిళా ఐఏఎస్‌లను కలిసేందుకు ఆమె విధులు నిర్వహిస్తున్న కార్యాలయానికి వెళ్లాడు. అయితే శివప్రసాద్‌ తరచూ తనను కలవడానికి వస్తున్నాడని తెలుసుకున్న మహిళా ఐఏఎస్‌.. అతన్ని ఎట్టి పరిస్థితుల్లో లోపలికి పంపవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో బుధవారం (సెప్టెంబర్‌ 13) నేరుగా మహిళా ఐఏఎస్‌ ఉంటున్న ఇంటి చిరునామాను తెలుసుకుని శివప్రసాద్‌ అక్కడికి వెళ్లారు.తన చేతుల్లో స్వీట్‌ బాక్స్‌ పట్టుకుని మేడమ్‌ని కలవడానికి వచ్చానని, స్వీట్‌ బాక్స్‌ ఇచ్చి వెళ్లిపోతానని సిబ్బందికి చెప్పాడు. మేడమ్‌ని ఒకసారి చూసి కలిసి వెళతాను అన్నాడు. ఈ విషయాన్ని సిబ్బంది బాధిత ఐఏఎస్‌కు తెలియజేయడంతో.. లోపలికి అనుమతించవద్దని ఆదేశాలు జారీ చేశారు. అందుకు సిబ్బంది అనుమతించకపోవడంతో శివప్రసాద్‌ను అక్కడి నుంచి పంపించారు. అయితే శివప్రసాద్‌ నుంచి ఇలాంటి వేధింపులు రావడంతో ఐఏఎస్‌ అధికారి కార్యాలయ అదనపు డైరెక్టర్‌ సికింద్రాబాద్‌లోని మార్కెట్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితుడు శివప్రసాద్‌పై పోలీసులు 354డి కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ వార్త సోషల్‌ విూడియాలో వైరల్‌ కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులే ఇలాంటి వేధింపులకు బలవుతుంటే ఇక సామాన్య ప్రజలకు దిక్కెవరని వాపోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: