
జిల్లాలో అక్టోబరు 21 నుండి 31వ తేదీ వరకు పోలీసు అమర వీరుల స్మారకోత్సవాలు
జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు
అమరవీరుల స్మారకోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు సంసిద్దమైన కృష్ణ జిల్లా పోలీసు యంత్రాంగం.
పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతీ ఏటా నిర్వహించే పోలీసు అమర వీరుల స్మారకోత్సవాలు సోమవారం నుండి ఘనంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ .ఆర్ గంగాధరరావు తెలిపారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసుల సేవలను, త్యాగాలను కొనియాడుతూ స్మారకోత్సవాలను జరుపుకోవడం జరుగుతుంది.
ఈనెల 21 వ తేదీ నుండీ 31 వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో జరగనున్నాయి.
విధి నిర్వహణలో అసువులు బాసిన అమర పోలీసును గుర్తు చేసుకోవడంతో పాటు సమాజంలో పోలీసుల కీలకమైన పాత్ర, విధులు, త్యాగాలు గురించి ప్రజల్లో అవగాహన తీసుకురావడమే ముఖ్య ఉద్ధేశ్యంగా స్మారకొత్సవాలు నిర్వహించడం జరుగుతుంది అని ఎస్పీ తెలిపారు.
జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాల వివరాలు.
అక్టోబరు 21తేదిన అమరవీరుల సంస్మరణ దినం.
ఈ నెల 21 ఉదయం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అమర వీరుల స్థూపం వద్ద జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసు అమర వీరుల సంస్మరణ దినం ఘనంగా నిర్వహించనున్నారు. మావోయిస్టులు,ఉగ్రవాదులు, తదితర అసాంఘిక శక్తులతో పోరాటమే గాక విధి నిర్వహణలో భాగంగా ప్రాణాలు అర్పించిన పోలీసు సిబ్బందిని స్మరించుకుంటూ నివాళులు అర్పించనున్నారు. స్మృతి పరేడ్ నిర్వహించి అమరులకు శ్రద్ధాంజలి ఘటించనున్నారు.
బిల్ బోర్డ్స్, హోల్డింగ్స్ ప్రదర్శన
21వ తేదీ నుండి 31వ తేదీ వరకు ప్రతి పోలీస్ స్టేషన్ల పరిధిలో ముఖ్యమైన కూడళ్ళ వద్ద పోలీస్ అమరవీరులకు సంబంధించిన బ్యానర్స్ హోల్డింగ్స్ ఫ్లెక్సీలు ప్రదర్శించబడతాయి
పోలీస్ ఫ్లాగ్ ధరించుట
21వ తేదీ నుండి 31వ తేదీ వరకు పోలీస్ ఫ్లాగ్ ను పోలీసు అధికారులు, సిబ్బంది ధరించాలి. మరియు ప్రజలు పోలీసువారి త్యాగాలను స్మరించుకుంటూ ధరించేలా అవగాహన కల్పించాలి.
ఓపెన్ హౌస్ ప్రదర్శన
22వ తేదీ నుండి 31వ తేదీ వరకు జిల్లా పోలీస్ కార్యాలయం లోను, పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీసులు విధి నిర్వహణలో ఉపయోగించే ఆయుధాలు,పరికరాలు, సాధనాలు మరియు సాంకేతిక ఉపకరణాలతో ఓపెన్ హౌస్ ప్రదర్శన నిర్వహించి విద్యార్థులు,ప్రజలకు అవగాహన కల్పిస్తారు.
పోలీస్ అమరవీరుల స్వగ్రామల సందర్శన
22వ తేదీ నుండి 31వ తేదీ వరకు జిల్లాలోని పోలీసు అమర వీరుల గ్రామాల సందర్శన.వారి కుటుంబ సభ్యులను పరామర్శించి అమరలైన పోలీస్ సిబ్బంది త్యాగాలను స్మరిస్తూ జ్ఞాపికలను అందజేస్తారు. అమర వీరుల సేవలను వివరించడం. డిఎస్పీ స్థాయి పోలీసు అధికారులు మరియు సిబ్బంది పోలీసు అమర వీరుల గ్రామాలు/పట్టణాలు సందర్శించనున్నారు.
వక్తృత్వపు,వ్యాస రచన పోటీలు
24వ తేదీ నుండి 27వ తేదీ వరకు సైబర్ నేరాల అరికట్టేందుకు తీసుకోవలసిన ముందు జాగ్రత్తలపై వ్యాసరచన వక్తృత్వపు పోటీలు విద్యార్థులకు నిర్వహించనున్నారు.జిల్లాలోని వివిధ పాఠశాలు/కళాశాలల్లోని విద్యార్థులకు చర్చా వేదికలు,వ్యాస రచన,వక్తృత్వపు పోటీలు పోలీసు అధికారులు నిర్వహిస్తారు.ఇందులో భాగంగా పర్యావరణ పరిరక్షించుటలో పోలీసుల పాత్ర అనే అంశంపై పోలీస్ సిబ్బందికి వ్యాస రచన, వక్తృత్వపు పోటీలు నిర్వహిస్తారు.
దేశభక్తిని తెలిపే సందేశాత్మకమైన చిత్రాలు ప్రదర్శన
21వ తేదీ నుండి 31వ తేదీ వరకు దేశభక్తిని తెలిపే ఒపెన్ థియేటర్ లలో సమాజ భద్రత కోసం అసాంఘిక శక్తులను అణచివేస్తూ త్యాగం, పరాక్రమాలు కనపరిచే పోలీసు దేశభక్తిని తెలిపే సందేశాత్మకమైన చిత్రాలను జిల్లా వ్యాప్తంగా ప్రదర్శింపనున్నారు. దేశభక్తిని తెలిపే సందేశాత్మకమైన దేశభక్తి చిత్రాలు ప్రదర్శిస్తారు.
పోలీస్ బ్యాండ్ ప్రదర్శన
28వ తేదీ నుండి 30 వ తేదీ వరకు పోలీసు బ్యాండ్ షోలు, పోలీసు వాయిద్య బృందాల ప్రదర్శనలు నిర్వహించనున్నారు. పోలీసుల త్యాగాలు తెలియజేసే పాటలు ఆలపించనున్నారు.
బ్లడ్ డొనేషన్ శిబిరాలు 28వ తేదీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ లలో పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొని రక్త దానం చేయనున్నారు. అన్ని సబ్- డివిజన్లలో పోలీసుల కుటుంబాలకు మెడికల్ క్యాంప్ నిర్వహిస్తారు
అమర వీరుల కుటుంబ సభ్యులలో ప్రత్యేక విజయాలు సాధించిన వారికి సన్మానం
30 తేదీన పోలీసు అమర వీరుల కుటుంబాల్లోని ప్రత్యేక విజయాలు సాధించిన వారికి సన్మానం చేయడం,వారి సేవలను ప్రశంసించనున్నారు.
రాష్ట్రీయ ఏక్తా దివస్ కార్యక్రమం
31వ తేదీన జిల్లా కేంద్రంగా “రాష్ట్రీయ ఏక్తా దివస్” కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఉదయం యూనిట్ రన్, సాయంత్రం కొవ్వొత్తులను ప్రదర్శిస్తు ర్యాలీ నిర్వహించనున్నారు.ఈ నెల 31వ తేదీన పోలీసు అమర వీరుల స్మారకోత్సవాలు ముగియనున్నాయి