10 వేల కోట్లు ఎక్కడా?

Spread the love

టీడీపీ ప్రభుత్వం పేద లకోసం నిర్మించిన టిడ్కోఇళ్లను బ్యాంకుల్లో తాకట్టుపెట్టి తీసుకున్న రూ. 10 వేల కోట్లు ఎవరిజేబుల్లోకి వెళ్లాయో చెప్పాలని టీడీపీ నేత బొండా ఉమ మహేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 201419 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం పేదలకు శాశ్వతంగా ఒక ఆస్తిని ఇవ్వాలనే సదుద్దేశంతో వారి సొంతింటికలను చంద్రబాబునాయుడు నిజం చేస్తే, జగన్‌ రెడ్డి నాలుగున్నరేళ్లు అధికారంలో ఉండి వారి కలల్ని కలలుగానే ఉంచాడని, టీడీపీ హయాంలో షీర్‌ వాల్‌ టెక్నాలజీతో పేదలకోసం నిర్మించిన 3.13లక్షల ఇళ్లను, జగన్‌ రెడ్డి బ్యాంకుల్లో తనఖాపెట్టి అప్పులు తీసుకోవడం, అతని సిగ్గుమాలిన తనానికి నిదర్శనమని టీడీపీ పొలిట్‌ బ్యూరోసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు.‘‘201419 మధ్యన టీడీపీప్రభుత్వం నిర్మించిన ఇళ్లు దాదాపు 90శాతం వరకు పూర్తయ్యాయి. కొన్నిచోట్ల మొత్తం నిర్మాణమే పూర్తయింది. చంద్రబాబు పేదలకోసం నిర్మించిన టిడ్కోఇళ్లను వారికి కేటాయించకుండా.. 30లక్షల ఇళ్లపట్టాలు పేదలకు పంచుతున్నట్టు ప్రకటనలు చేసి ప్రభుత్వం రూ. 7వేలకోట్లు కొట్టేసిందని బొండా ఉమ ఆరోపించారు. చాలీ చాలని ఇంటి జాగాలు.. నివాసయోగ్యం కాని ప్రాంతాల్లో పేదలకు ఇచ్చి.. వారిన ఉద్ధరించినట్టు జగన్‌ అతని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుందన్నారు. టీడీపీప్రభుత్వం గతంలో పేదలకోసం కట్టించిన ఇళ్లను వారికి ఇవ్వని జగన్‌ రెడ్డి.. ఆ ఇళ్లను బ్యాంకుల్లో తాకట్టుపెట్టి… లబ్ధిదారులకే తెలియకుండా రూ.10వేలకోట్ల రుణం తీసుకొచ్చాడు. రు లబ్ధిదారులకు ఇళ్లు ఇస్తున్నామని.. వాటికి సంబంధించిన కొద్దీగొప్పాపనులు పూర్తిచేయాల్సి ఉందని బ్యాంకులకు చెప్పి జగన్‌ ప్రభుత్వం రుణాలు పొందిందని బొండా ఉమ తెలిపారు. అలా తీసుకున్న రుణాలకు ఈ ప్రభుత్వం రెండేళ్ల కాలపరిమితి అడిగింది. రెండేళ్లు అయినా బ్యాంకుల్లో అప్పు తీసుకున్న జగన్‌ రెడ్డి ప్రభు త్వం ఇళ్ల నిర్మాణం పూర్తిచేయలేదు. దాంతో బ్యాంకులు నేరుగా లబ్ధిదారులకే నోటీసు లు పంపిస్తున్నాయన్నారు. అంతటితో ఆగకుండా చివరకు ఇళ్ల లబ్ధిదారులకు మరే బ్యాంకులో రుణం పుట్టకుండా వారిని ఎన్‌.పీ.ఏ జాబితాలో చేర్చా యని ఆరోపించారు. బ్యాంకుల నుంచి ఒత్తిడి రావడం..ఇళ్లు వేలం వేస్తామని చెప్పడంతో రాష్ట్రవ్యాప్తం గా ఇళ్లు లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. బ్యాంకులు ఎన్‌..పీ.ఏలుగా ప్రకటించిన పేదల్ని తిరిగి రెగ్యులర్‌ స్టేటస్‌ లో పెట్టేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాం. టీడీపీ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చి ఉంటే.. పేదలకోసం గతంలో నిర్మించిన 3.13లక్షల ఇళ్లకు తోడు రాష్ట్రంలోని ప్రతి పేదవాడి సొంతింటి కలను నెరవేర్చేది. నేడు బ్యాంకులవారు పేదలపై పడి తీసుకున్న రుణం చెల్లించాలని అడిగే పరిస్థితి కూడా ఉండేది కాదు. గతంలో టీడీపీప్రభుత్వం పేదలకు కేటాయించిన ఇళ్లతో పాటు…అంతకు ముందు ఉమ్మడి రాష్ట్రంలోని ప్రభుత్వాలు 15, 20 ఏళ్లక్రితం పేదలకు ఇచ్చిన ఇళ్లపై కూడా జగన్‌ రెడ్డి ప్రభుత్వం వన్‌ టైమ్‌ సెటిల్మెంట్‌ స్కీమ్‌ కింద ప్రజలనుంచి డబ్బులు వసూలు చేసిందని ఆరోపించారు. ప్రజలకే తెలియకుండా వారిని మోసగిస్తూ… రాష్ట్రాన్ని లూఠీ చేసిన జగన్‌ రెడ్డి మరలా ముఖ్యమంత్రి కావడానికి ప్రభుత్వసొమ్ముతో వై ఏపీ నీడ్స్‌ జగన్‌ అనే కార్యక్రమానికి శ్రీకారంచుట్టాడని బొండా ఉమ ఆరోపించారు. జగన్‌ అతని ప్రభుత్వం ఏపీ నీడ్స్‌ జగన్‌ అంటుంటే.. ప్రజలంతా ముక్తకంఠంతో ఏపీ హేట్స్‌ జగన్‌ అంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల్ని మరలా రాష్ట్రానికి జగన్‌ ఎందుకు కావాలో చెప్పాలని ప్రజలే నిలదీస్తున్నారు. జగన్‌ రెడ్డి అతని ప్రభుత్వం మాఫియాగా ఏర్పడి తమను దోచుకుందనే వాస్తవాన్ని.. నాలుగున్నరేళ్లలో అంతులేని అవినీతి జరిగిందనే నిజాన్ని ప్రజలు గ్రహించారు. ఎంతత్వరగా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపుదామా అని ఏపీ ప్రజానీకం ఎదురు చూస్తోందని స్పష్టం చేశారు. టిడ్కోఇళ్ల లబ్ధిదారులకు తెలియకుండా ఇళ్లు తాకట్టుపెట్టి తీసుకొచ్చిన రూ.10వేల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో ముఖ్యమంత్రి చెప్పాలని బొండా ఉమ డిమాండ్‌ చేశారు. జగనన్న కాలనీల ముసుగు లో పేదలకు కేటాయించిన సెంటుపట్టాలు… తూతూమంత్రంగా జరుగుతున్నఇళ్ల నిర్మా ణం అంతా ఈ ప్రభుత్వ అవినీతిలో భాగంగా జరిగిందే. గత ప్రభుత్వం పేదలకోసం నిర్మించిన ఇళ్లకు నేడు బ్యాంకు అధికారులు నోటిసులివ్వడం కూడా జగన్‌ రెడ్డి అవినీ తిలో భాగమనే చెప్పాలి. ఇళ్ల నిర్మాణం విషయంలోనే కాదు.. అనేక పథకాలతో ఏ ప్రభుత్వం ఏ నాయకుడు తమకు మంచిచేశాడో…తమ బిడ్డల భవిష్యత్‌ గురించి ఆలోచించాడో ప్రజలు గ్రహించాలి.’’ అని బొండా ఉమా విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: