సుప్రీంలో కేసు మరోసారి వాయిదా

Spread the love

సుప్రీం లో కేసు మరోసారి వాయిదా

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు పై సుప్రీం కోర్టులో జరుగుతున్న విచారణ మరోసారి శుక్రవారానికి వాయిదా పడింది. ఈ రోజు జరిగిన విచారణలో భాగంగా ప్రభుత్వ తరుపున ముకుల్ రోహిత్గీ వాదనలు వినిపించారు. చంద్రబాబు కేసులో 17 ఏ వర్తించదని క్వాష్ చేయవద్దని కోర్టును కోరారు. ఒకవేళ 17 ఏ వర్తించినా సరే ఇందులో వందల కోట్ల అవినీతి జరిగిందని అటువంటి పరిస్థితుల్లో ఇంకా దర్యాప్తు జరగాల్సి ఉందని వాదించారు. ఇదే సమయంలో ధర్మాసనం కొన్ని ప్రశ్నలను లేవనెత్తింది. ఈ కేసులో పిసి యాక్ట్ లు వర్తించకపోతే ఏసీబీ ప్రత్యేక కోర్టు విచారింటానికి ఉన్న పరిధి ఏమిటని అడుగగా ఐపీసీ యాక్టులు ఉన్నా సరే, ఈ చంద్రబాబు కేసులో పెట్టిన అన్ని సెక్షన్లను ప్రత్యేక కోర్టు విచారించదగినవే అని తన వాదనలు వినిపించారు. ఈ రోజు ప్రభుత్వ తరుపున లాయర్ వాదనలు మాత్రమే కోర్టులో వినిపించారు. దీంతో చంద్రబాబు తరుపున లాయర్లు వాదనలు వినేందుకు శుక్రవారానికి కేసును వాయిదా వేశారు.అదే రోజు ధర్మాసనం తీర్పు కూడా వెలువరించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: