
ఈ నెల 4వ తేదీన పవన్ కళ్యాణ్ కృష్ణ జిల్లా పెడన నియోజకవర్గంలో జరగనున్న వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ పై దాడులకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసిందని మంగళవారం జనసేన అధినేత పవన్ సంచలనం వ్యాఖ్యలు చేశారు. మచిలీ పట్నంలో జరిగిన జనవాణి ప్రోగ్రామ్ లో ఆయన ఈ అనుమానం వ్యక్తం చేశారు. అనకాపల్లి లో జరిగినట్లు వైసీపీ కార్యకర్తలే జనసైనికులపైకి దాడులకు యత్నించే అవకాశం ఉందని ,జన సైనికులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సుమారు ఊదు వేలమంది దాడులకు యత్నించే అవకాశాలున్నాయని తన వద్ద సమాచారముందని ఆయన తెలిపారు. అయితే జనసైనికులు దాడులకు వచ్చే వారిని పట్టుకుని చట్టానికి అప్పగించాలని అభ్యర్ధించారు. కాగా జనవాణి ప్రోగ్రామ్ మధ్యలోనే పవన్ కళ్యాణ్ కు తీవ్రమైన వెన్నునొప్పి రావటంతో కార్యక్రమం మధ్యలోనే వెళ్లి పోయారు.