బాబు ఇంకా వారం రోజులు జైల్లోనే

Spread the love

సుప్రీం లో క్వాష్ పిటీషన్ పై విచారణ సోమవారానికి వాయిదా .

చంద్రబాబు సుప్రీం కోర్టులో వేసిన క్వాష్ పిటీషన్ పై విచారణ వచ్చే సోమవారానికి వాయిదా పడింది.ఈ లోగా కేసుకు సంబందించిన అన్ని డాక్యూమెంట్లను హై కోర్టుకు సమర్పించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ రోజు కోర్టులో చంద్రబాబు ,ప్రభుత్వం తరుపున లాయర్లు తమ వాదనలు వినిపించారు. చంద్రబాబు తరుపున వాదించిన లాయర్లు ముఖ్యంగా 17 ఏ సెక్షన్ల పైనే ఎక్కువగా ప్రస్తావించారు. ఈ సందర్భంగా ధర్మాసనం ఇరుపక్షాలు కొన్ని ప్రశ్నలను అడిగింది. ఎఫ్ ఐ ఆర్ ఎప్పుడు నమోదు చేశారు ? విచారణ ఎప్పుడు ప్రారంభం అయ్యిందని ధర్మాసనం ప్రశ్నించింది. 17 ఏ సెక్షన్ చట్ట సవరణ జరిగిన తర్వాతే కేసు నమోదు చేసినందున పరిగణలోకి తీసుకోవాల్సిందేనని కోరారు.సుదీర్ఘ కాలం చంద్రబాబును జైలులో ఉంచాలనే కక్షతో వరుసగా కేసులు నమోదు చేస్తున్నారు.అని కోర్టు దృష్టికి తెచ్చారు. చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు ఏపీ సి ఐ డి ఇప్పటి వరకు ఒక్క ఆధారమూ చూపలేకపోయిందని చంద్రబాబు తరుపు న్యాయవాదులు ధర్మాసనానికి తెలిపారు.

అయితే నేరం జరిగింది చట్టసవరణ జరగక ముందే కనుక 17 ఏ వర్తించదని ప్రభుత్వ తరుపున ముఖుల్ రోహిత్గీ వాదించారు. 2018 ముందు నేరాలకు 17 ఏ వర్తించదని ఎలా చెప్తారు అని ప్రభుత్వ లాయర్ ముఖుల్ రోహిత్జీని ధర్మాసనం ప్రశ్నించింది. తదనంతరం విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: