కొనుగోలుదారులకు ఆకర్షణీయ బహుమతుల బొనాంజా
- చివరిరోజు బంపర్ డ్రాలో విజేతకు స్కూటీ బహుమతి
- సూపర్ జీఎస్‌టీ సూపర్ సేవింగ్స్ ఉత్పవాలను సద్వినియోగం చేసుకోండి
- జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ

ఈ నెల 13న నగరంలోని పున్నమిఘాట్‌లో ప్రారంభమైన గ్రేట్ అమరావతి షాపింగ్ ఫెస్టివల్‌లో ప్రతిరోజూ లక్కీడ్రా నిర్వహిస్తున్నామని.. కొనుగోలుదారులు ఆకర్షణీయమైన బహుమతులు సొంతం చేసుకుంటున్నారని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ తెలిపారు.
సూపర్ జీఎస్‌టీ – సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమాల్లో భాగంగా జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ వారి మార్గనిర్దేశనంతో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ, జిల్లా అధికార యంత్రాంగం, విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న షాపింగ్ ఫెస్టివల్‌లో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, స్థానిక హస్తకళాకారుల ఉత్పత్తులు వంటి స్టాళ్లు ఉన్నాయని.. ప్రజలు ఈ ఫెస్ట్‌ను సందర్శించి వినోదంతో పాటు ప్రత్యేక ఆఫర్లు, జీఎస్‌టీ సేవింగ్స్‌తో షాపింగ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రతి కొనుగోలుపై కూపన్లు అందించి ప్రతిరోజూ లక్కీడ్రా తీసి విజేతలను ఎంపికచేసి ఆకర్షణీయ బహుమతులు అందజేస్తున్నట్లు తెలిపారు.ఫెస్టివల్ చివరిరోజు బంపర్‌డ్రా నిర్వహించి విజేతకు స్కూటీ బహుకరించనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 19వ తేదీ వరకు జరగనున్న గ్రేట్ అమరావతి షాపింగ్ ఫెస్టివల్ ద్వారా ప్రజలకు నాణ్యమైన ఉత్పత్తులు తగ్గిన జీఎస్‌టీ రేట్లతో, ప్రత్యేక రాయితీలతో వ్యాపార, వాణిజ్య సంస్థలు అందిస్తున్నాయని.. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు లక్కీడ్రా వంటి మనోరంజక కార్యక్రమాల ద్వారా సందర్శకులు, కొనుగోలుదారుల్లో ఆనందం వెల్లివిరుస్తోందని.. ఫెస్ట్‌ను విజయవంతంగా ముందుకుతీసుకెళ్తున్న స్టాళ్ల యజమానులకు, సందర్శకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు జేసీ ఇలక్కియ పేర్కొన్నారు.
