
నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రధాని మోడీ ప్రకటించారు. గత ఎన్నికల్లో తమ పార్టీ ఇచ్చిన హామీ మేరకు పసుపు రైతులకు మేలు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ములుగు లో సమ్మక్క సార్క పేరిట గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం 900 కోట్ల రూపాయల నిధులను వెచ్చించనున్నట్లు తెలిపారు. తెలంగాణాలో 13500 కోట్ల రూపాయల విలువైన పనులకు ప్రధాని ప్రారంభోత్సవం చేశారు. పాలమూరులో ప్రజాగర్జన పేరిట ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. పీఎం విశ్వకర్మ యోజన క్రిందచేతి వృత్తుల వారికి మార్కెటింగ్ సదుపాయం,ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు తెలిపారు. రైతుల కోసం ప్రధాన మంత్రి కిసాన్ ఇప్పటికే పదివేల కోట్ల రూపాయలను వెచ్చించినట్లు తెలిపారు. తెలంగాలో రాబోయే ఎన్నికల్లో అవినీతికి తావులేని ప్రభుత్వం కావాలంటే బీజేపీని ఎన్నుకోవాలని కోరారు.