
దేశంలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు హాట్ టాపిక్‌గా మారాయి. బీహార్‌లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రంతో ముగిసింది. చివరి రోజు ఎన్నికల ప్రచారం కావడంతో ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. బీహార్ రెండో విడత ఎన్నికల ప్రచారంలో బీజేపీ అగ్రనేతలతో పాటు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రచారం చేసారు. . ఆర్జేడీ, కాంగ్రెస్, సీపీఎం సహా పార్టీలు విస్తృత ప్రచారం చేసారు. రెండో విడతలో 122 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇప్పటికే 121 స్థానాలకు పోలింగ్ ముగిసింది. 14వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల సంఘం ప్రధానాధికారి జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు వివేక్ జోషి, ఎస్‌ఎస్ సంధు.. ఎన్నికలను పర్యవేక్షిస్తున్నారు.
నవంబర్ 6న బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలివిడత పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 60.13 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. మొదటి దశలో భాగంగా 18 జిల్లాల్లో 121 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగగా..
తొలి గంటల్లో పలువురు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
బిహార్‌లోని సమస్తీపుర్ జిల్లాలో రోడ్డు పక్కన అధిక సంఖ్యలో వీవీప్యాట్ స్లిప్పులు చెల్లాచెదురుగా పడి ఉండడం కలకలం రేపింది. ఈ ఘటనపై తక్షణమే స్పందించిన ఎన్నికల సంఘం.. ఓ సహాయ రిటర్నింగ్ అధికారిని (ఏఆర్‌వో) సస్పెండ్ చేయడంతో పాటు ఆయనపై కేసు నమోదు చేసింది. సరైరంజన్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓ కళాశాల సమీపంలో లభించిన ఈ స్లిప్పులు మాక్‌పోల్‌కు సంబంధించినవని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు. వాస్తవ పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన స్లిప్పులు సురక్షితంగా ఉన్నాయని, ఈ ఘటన వల్ల ఎన్నికల పవిత్రతకు ఎటువంటి భంగం వాటిల్లలేదని ఆయన తేల్చి చెప్పారు. రోడ్డు పక్కన వీవీప్యాట్ స్లిప్పులు చెల్లాచెదురుగా పడి ఉన్న వీడియో వైరల్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈవీఎమ్‌లు, వీవీప్యాట్‌ల పనితీరురును పరీక్షించడానికి, ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇవ్వడానికి ప్రతి పోలింగ్ బూత్‌లో మాక్ పోల్స్ నిర్వహిస్తారు. మాక్ పోలింగ్ పూర్తయ్యాక, వీవీప్యాట్ స్లిప్పులను ప్రత్యేక కవర్లో సీలు చేసి సురక్షితంగా దాచాల్సి ఉంటుంది. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించినందుకు గాను సంబంధిత అధికారిపై ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంది
