- ఉద్యోగాలు ఇవ్వకుండా..ఉపాధి కూడా ఎత్తేస్తారా
- కేంద్రం తీరుపై మండిపడ్డ విపక్షనేత రాహుల్
- పార్లమెంట్ వరకు నిరసనలు తెలుపుతామని వెల్లడి
తెలుగు ట్రాక్,న్యూఢిల్లీ,డిసెంబర్ 16: మహాత్మాగాంధీ జాతీయ గ్రావిూణ ఉపాధి హావిూ పథకం చట్టాన్ని రద్దు చేస్తూ దాని స్థానంలో కేంద్రం కొత్త చట్టాన్ని తీసుకురావడానికి బిల్లు ప్రవేశపెట్టడాన్ని విపక్ష కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. మహాత్మా గాంధీ ఆదర్శాలను అవమానించమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోందని దుయ్యబట్టారు. ఉద్యోగాలు ఇవ్వకుండా యువత భవిష్యత్తును నాశనం చేసిన మోదీ ప్రభుత్వం..ఇప్పుడు గ్రావిూణ ప్రజలకు కూడా ఉపాధి లేకుండా చేస్తోందని మండిపడ్డారు. ఈ ప్రజా వ్యతిరేక బిల్లుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ర్యాలీగా పార్లమెంటు వరకు వెళ్లి తమ నిరసనను తెలియజేస్తాయన్నారు. మహాత్మా గాంధీ ఆలోచనలు, పేదల హక్కులపై ప్రధాని మోదీకి ముందు నుంచి తీవ్రమైన అయిష్టత ఉంది. గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావాలనే గాంధీ ఆలోచనకు ఎంజీ నరేగా ఓ సజీవ స్వరూపం. ఎన్నో ఏళ్లుగా ఇది లక్షలాది మంది గ్రావిూణ ప్రజలకు జీవనాడిగా ఉంది. కొవిడ్ సమయంలో కూడా ఈ పథకం పేదలకు ఆర్థిక భద్రతను ఇచ్చింది. కాంగ్రెస్ తీసుకువచ్చిన ఎంజీ నరేగా ప్రధాని మోదీని ఎప్పుడూ కలవరపెడుతూనే ఉంది. కాబట్టి దీనిని బలహీనపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం పదేళ్లుగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే దీనిని పూర్తిగా తుడిచిపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారని రాహుల్ సోషల్ విూడియాలో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రావిూణ ఉపాధి హావిూ చట్టం స్థానంలో కేంద్రం కొత్త బిల్లును తీసుకురావాలని యోచిస్తున్న సమయంలో, కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది మహాత్మాగాంధీ ఆదర్శాలకు అవమానమని అన్నారు. గ్రావిూణ కుటుంబాలకు ప్రతీ ఏడాది 100 రోజుల వేతన ఉపాధికి చట్టపరమైన హావిూని అందించే పథకాన్ని రద్దు చేయాలని మోడీ సర్కార్ యోచిస్తోందని మండిపడ్డారు. కేంద్రం కొత్తగా రోజ్‌గార్ మరియు అజీవిక మిషన్ బిల్లు, 2025ను తీసుకురావడంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రధాని మోడీకి రెండు విషయాలు నచ్చవని, మహాత్మాగాంధీ ఆలోచనలు, పేదల హక్కులు నచ్చవని ఎక్స్‌లో ఆరోపించారు. కేంద్రం తీసుకురాబోతున్న కొత్త బిల్లుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు రోడ్ల నుంచి పార్లమెంట్ వరకు నిరసన తెలుపుతాయని ఆయన అన్నారు. కొత్త బిల్లు మహాత్మా గాంధీ ఆదర్శాలకు అవమానమని, నిరుద్యోగం ద్వారా భారత దేశ యువత భవిష్యత్తును నావనం చేసిన తర్వాత, మోడీ ప్రభుత్వం ఇప్పుడు గ్రామీణ పేదల జీవనోపాధిని లక్ష్యంగా చేసుకున్నారని అన్నారు. ఉపాధి హావిూ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం 2005లో తీసుకువచ్చింది.
