విద్యార్థుల విద్య, ఆరోగ్యం, భద్రతపై రాజీపడొద్దు
వెలగపూడి సచివాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి డా. స్వామి సమీక్ష
తెలుగు ట్రాక్,అమరావతి,డిసెంబర్ 16 :
రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాలు, డా. బి.ఆర్ అంబేద్కర్ గురుకులాల విద్యార్థుల విద్య, ఆరోగ్యం, భద్రతపై రాజీపడొద్దని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం నాడు వెలగపూడి సచివాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి డా. స్వామి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష లో సంక్షేమ వసతి గృహాలు, అంబేద్కర్ గురుకులాల విద్యార్థుల విద్య, ఆరోగ్యం, భద్రత, సంక్షేమం, నూతన హాస్టళ్ల నిర్మాణం, స్కాలర్షిప్పులు తదితర అంశాలపై అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ…విద్యార్థుల ఆరోగ్యం, భద్రత, సంక్షేమంపై ఎక్కడా రాజీపడొద్దు.పేద విద్యార్థుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ద్వేయం.
పరీక్షల్లో 100% ఉత్తీర్ణత లక్ష్యంగా ఉపాధ్యాయులు పనిచేయాలన్నారు. అన్ని సంక్షేమ హాస్టళ్లు, అంబేద్కర్ గురుకులాల్లో ముస్తాబు కార్యక్రమం అమలు చేయాలన్నారు. . ఈ కార్యక్రమం ద్వారా పిల్లల్లో మంచి ఆరోగ్యంతో పాటు వారికి వ్యక్తిగత పరిశుభ్రత అలవాటవుతుందని తెలిపారు. .
విద్యార్థులకు ఈ నెలాఖరులోపు కాస్మోటిక్ కిట్స్ అందజేయాలి. పీఎం అజయ్ కింద నిర్మిస్తున్న నూతన హాస్టళ్ల నిర్మాణ పనులు త్వరితిగతిన పూర్తి చేయాలని మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అధికారులను ఆదేశించారు
నెలాఖరులోపు కాస్మోటిక్ కిట్స్
