సాంకేతిక దిక్సూచి

telugu track
Spread the love

గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా అమరావతి
దేశానికి గేమ్ చేంజర్ గా ఏపీ క్వాంటం సెంటర్
అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీ
50 ఎకరాల్లో కార్యాలయాలకు శంకుస్థాపన

తెలుగు ట్రాక్,అమరావతి
భారతదేశ భవిష్యత్ సాంకేతిక రంగాన్ని మలుపుతిప్పే చారిత్రక ఘట్టానికి అమరావతి వేదికయ్యింది. . ప్రపంచ క్వాంటమ్ టెక్నాలజీ రంగంలో ఏపీని అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో రూపొందించిన ‘అమరావతి క్వాంటమ్ వ్యాలీ’ భవన నిర్మాణానికి పునాదిరాయి పడింది. తద్వారా భారతదేశ క్వాంటమ్ విప్లవానికి నాయకత్వం వహించే అవకాశం ఆంధ్రప్రదేశ్ కు రానుంది. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖా మంత్రి జితేంద్ర సింగ్‌తో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెం గ్రామంలో ‘క్వాంటమ్ వ్యాలీ’ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అమరావతిలో రూపుదిద్దుకుంటున్న క్వాంటమ్ వ్యాలీ రాష్ట్రానికి, దేశానికి మైలురాయిగా నిలవనుంది. భారతదేశపు మొదటి 133 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్‌ను అమరావతికి తీసుకురావడానికి ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టి సంస్థలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూని¹ ¿షన్స్, క్వాంటమ్ సెన్సార్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డిఫెన్స్, హెల్త్‌కేర్, ఫైనాన్స్ వంటి కీలక రంగాల్లో పరిశోధన, ఆవిష్కరణలు, ఉత్పత్తి, నైపుణ్యాభివృద్ధి కి ఇక్కడ చోటు దక్కనుంది. ప్రపంచంలోనే అత్యాధునిక క్వాంటమ్ హబ్‌ల సరసన అమరావ తిని నిలపాలనే సంకల్పంతో ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు తలపెట్టారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *