ఇక రంగంలోకి కేసీఆర్‌ ఫ్యామిలీ

Spread the love

ఇక రంగంలోకి కేసీఆర్‌ ఫ్యామిలీ
తెలుగు ట్రాక్,హైదరాబాద్‌,మార్చి 22
:రాబోయే లోక్‌ సభ ఎన్నికలు బీఆర్‌ఎస్‌ అధిష్టానానికి అగ్నిపరీక్షగా మారాయి. ఓ వైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో నిరాశలో ఉన్న పార్టీ శ్రేణులకు చెప్పుకోదగిన సంఖ్యలో ఎంపీ సీట్లు గెలిచి భరోసా నింపాలని భావించిన బీఆర్‌ఎస్‌ కు తాజా పరిణామాలు అందుకు ఇబ్బందికరంగా మారాయి. ఓ వైపు కీలక నేతలు పార్టీని వీడిచి వెళ్తుంటే మరో వైపు కవిత అరెస్ట్‌ కావడంతో పార్టీని పరిస్థితిని మరింత సక్లిష్టంగా మార్చిందనే చర్చ జరుగుతోంది. పార్లమెంట్‌ ఎన్నికలపై ఫోకస్‌ పెట్టాల్సిన సమయంలో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, పార్టీలో ట్రబుల్‌ షూటర్‌ గా ఉన్న హరీశ్‌ రావులు కవిత విషయంలో ఢల్లీి మకాం వేయడం చర్చగా మారింది. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తన మనసు మార్చుకున్నారని ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో సంచలన నిర్ణయానికి వచ్చారనే టాక్‌ జోరుగా వినిపిస్తోందిప్రస్తుతం బీఆర్‌ఎస్‌ దశల వారీగా లోక్‌ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తోంది. అయితే పార్టీకి పూర్వ వైభవం రావాలన్నా, క్యాడర్‌ లో కొత్త జోష్‌ నింపాలన్నా కేసీఆర్‌ కుటుంబ సభ్యులు పోటీలో ఉండాలనే వాదన వినిపించింది. కానీ ఇప్పటి వరకు ప్రకటించిన అభ్యర్థులలో కేసీఆర్‌ కుటుంబానికి చెందిన వ్యక్తులు ఒక్కరు లేరు. దీంతో పార్టీ పరిస్థి మరింత ఇబ్బందికరంగా మారుతోందనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇక తానే రంగంలోకి దిగానే నిర్ణయానికి కేసీఆర్‌ వచ్చారనే టాక్‌ వినిపిస్తోంది. నిజానికి మెదక్‌ నుంచి కేసీఆర్‌ పోటీ చేస్తారనే టాక్‌ చాలా కాలంగా వినిపిస్తోంది. కానీ అధిష్టానం మాత్రం ఒంటేరు ప్రతాప్‌ రెడ్డిని దాదాపు ఖరారు చేసిందనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలో బీజేపీ నుంచి రఘునందన్‌ రావు పేరు ఖరారు కావడం, కాంగ్రెస్‌ నుంచి నీలం మధు పేరు జోరుగా వినిపిస్తుండటంతో ఇక్కడ కేసీఆర్‌ రంగంలోకి దిగడం ద్వారా విజయం మరింత సులభతరం అవుతుందని దాంతో పార్టీ ఖాతాలో ఓ ఎంపీ సంఖ్య పెరుగుతుందనే అభిప్రాయానికి అధినేత వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో తాను లేదా హరీశ్‌ రావు ఎవరిలో ఒకరు పోటీకి దిగేందుకు సిద్ధపడుతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం వినిపిస్తోంది. అయితే కేసీఆర్‌ పోటీ విషయంలో మరోసారి ఊహాగానాలు తెరపైకి రావడం వెనుక ప్రజల మూడ్‌ ఎలా ఉందని తెలుసుకోవడానికి బీఆర్‌ఎస్‌ ఎదైనా లీకులిస్తోందా? లేక నిజంగానే కేసీఆర్‌, హరీశ్‌ రావు బరిలోకి దిగబోతున్నారా అనేది కాలమే నిర్ణయించాల్సి ఉంది.ఎన్నికల తేదీ ముంచుకు వస్తున్న తరుణంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీలు నిత్యం ప్రజల్లో ఉండేలా ప్రణాళికలు రచించుకుంటుంటే బీఆర్‌ఎస్‌ లోని టాప్‌ లీడర్లు మాత్రం సొంత నేతలకు దూరంగా ఉండటం చర్చగా మారింది. కవిత అరెస్ట్‌ వ్యవహారంలో న్యాయపరమైన పోరాటం కోసం కేటీఆర్‌, హరీశ్‌ రావులు ఢల్లీిలోనే ఉన్నారనే టాక్‌ వినిపిస్తుండగా అధినేత కేసీఆర్‌ నందినగర్‌ లేదా ఫామ్‌ హౌస్‌ కే పరిమితం అవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులను ప్రకటించినా ప్రజల్లోకి వెళ్లేందుకు నాయకులకు సరైన గైడ్‌ లైన్స్‌ లేకుండా పోయాయనే చర్చ జరుగుతోంది. పార్టీ కోసం టైమ్‌ కేటాయించాల్సిన సమయంలో కుటుంబ సభ్యుల వ్యవహారాలల్లోనే టాప్‌ లీడర్లు మునిగిపోతే పార్టీ ఫ్యూచర్‌ ఏంటి అనే చర్చ క్యాడర్‌ లో వినిపిస్తోంది. కేటీఆర్‌, హరీశ్‌ రావు ఢల్లీిలో వ్యవహారాలు చక్కబెడుతుంటే కేసీఆర్‌ అయినా కనీసం విూడియా ముందుకు రాకుండా మౌనం దాల్చడం ఏంటనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: