ఉదయం సీబీఎస్… రాత్రి లోకేష్..

telugu track
Spread the love

ఆత్మీయ పలకరింపులు..
ఎమ్మెల్యేలతో వరుస భేటీలు

రాజకీయ వ్యూహాలు, అసెంబ్లీ సమావేశాలు,పెట్టుబడులు వ్యవహారాలు,సంక్షేమ పథకాల అమలు,అభివృద్ధిపై దృష్టి ఇంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ..ఏపీ ముఖ్య మంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగాప్రతి రోజు ఉండవల్లిలోని.. ఆయన నివాసంలో ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వారి కుటుంబ సభ్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నారు. . ఈ సమావేశం వనభోజనాల తరహాలో అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో సాగుతుంది. . రాజకీయ చర్చలకు తావులేకుండా, కేవలం కుటుంబ విషయాలు, పిల్లల చదువులు, వారికి గల క్రీడాభిలాషపై మాట్లాడుకుంటున్నారు. . సమావేశానికి వచ్చిన చిన్నపిల్లలతో లోకేష్ సరదాగా కబుర్లు చెబుతూ గడుపుతున్నారు. . చదువు, కెరీర్ ఒక్కటే జీవితం కాదు..పిల్లలు క్రీడలను కూడా కెరీర్‌గా ఎంచుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి’ అని లోకేష్ ఈ సందర్భంగా సూచించారు. తన నియోజకవర్గమైన మంగళగిరిలోని చేనేత కార్మికులకు అండగా నిలిచేందుకు లోకేష్ ప్రతి అవకాశాన్నీ వాడుకుంటున్నారు. ఈ సమావేశానికి వచ్చిన ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా మంగళగిరి చేనేత చీరలను కానుకగా అందజేసి తన నియోజకవర్గ బ్రాండింగ్‌ను చాటుకున్నారు. కేవలం విందుకే పరిమితం కాకుండా.. బాధ్యతాయుతమైన నాయకుడిగా లోకేష్ మరో అడుగు వేశారు. గతంలో ఆయా నియోజకవర్గాల నాయకులు తనకు ఇచ్చిన వినతులపై తాజా పరిస్థితి ఏంటి? పనులు ఏ దశలో ఉన్నాయి? అనే అంశాలతో కూడిన స్టేటస్ రిపోర్టులను స్వయంగా ఆయా నాయకులకు అందజేశారు. ఇప్పటికే విందులో గుంటూరు ఎంపీ / కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (తెనాలి`జనసేన), ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్ (తాడికొండ),ధూళిపాళ్ల నరేంద్రకుమార్ (పొన్నూరు),బూర్ల రామాంజనేయులు (ప్రత్తిపాడు),గల్లా మాధవి (గుంటూరు వెస్ట్),నసీర్ అహ్మద్ (గుంటూరు ఈస్ట్),ఎమ్మెల్సీ ఆలపాటి రాజేందప్రసాద్,విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని),తంగిరాల సౌమ్య (నందిగామ),శ్రీరాం రాజగోపాల్ (జగ్గయ్యపేట),వసంత వెంకట కృష్ణప్రసాద్ (మైలవరం),కొలికపూడి శ్రీనివాసరావు (తిరువూరు),బొండా ఉమామహేశ్వరరావు (విజయవాడ సెంట్రల్),గద్దె రామమోహన రావు (విజయవాడ ఈస్ట్),ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ వీరిలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *