
గత దశబ్దాల కాలంగా పాతబస్తిని ఎంఐఎం నిర్వీర్యం చేసిందని బహదూర్ పుర నియోజకవర్గం కాంగ్రెస్ ఎంమ్మెల్యే అభ్యర్థి పులిపాటి రాజేష్ కుమార్ తెలిపారు. సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా అయన నియోజకవర్గం లోని మోచి కాలనీ, రమ్నస్ పుర ,
తాడ్ బన్, ఐటీఐ, కలపత్తర్, జూపార్క్, తదితర ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా పులిపాటి రాజేష్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గం ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. ఆ మార్పు కాంగ్రెస్ తోనే సాధ్యమని కాంగ్రెస్ ను గెలిపించడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. గత 50 ఏళ్లుగా ఎం ఐ ఎం పాత నగరానికి చేసింది ఏమిలేదన్నారు. కొత్తగా వెలుస్తున్న అనేక ప్రాంతాలు అభివృద్ధిలో ముందుకు సాగుతున్నాయని, పాత బస్తి మాత్రం వెనుకంజలో ఉందన్నారు. కాంగ్రెస్ గెలిస్తే 6 గ్యారంటీలు అమలు చేయడంతో పాటు నియోజకవర్గాన్ని సమున్నతంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
తాను గెలిస్తే జరిగే అభివృద్ధికి హామీ ఇస్తూ ఆయన నియోజకవర్గ ప్రజలకు బాండ్ పేపర్ లను సైతం అందించారు