అభివృద్ధి ఇదేనా : మహమ్మద్ ముజీబుల్లా

Spread the love

ప్రజలను కేవలం ఓటు బ్యాంకు గానే ఎం ఐ ఎం గుర్తిస్తుందని చార్మినార్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మహమ్మద్ ముజీబుల్లా ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోమవారం నియోజకవర్గం లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ముజీబుల్లా మాట్లాడుతూ ఎన్నికల సమయం లోనే ఎం ఐ ఎం నాయకులు ప్రజల మధ్యన కనిపిస్తారని అన్నారు.
ఎం ఐ ఎం నాయకులు అధికారులపై దౌర్జన్యం చేస్తూ ప్రజలను, అధికారులను భయబ్రాంతులకు గురిచేస్తారని తెలిపారు. అభివృధిని అడ్డుకునే ఎం ఐ ఎం కు ఈ ఎన్నికల్లో ప్రజలు గట్టి బుద్ది చెప్పనున్నారని అయన తెలిపారు. ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించి పాతబస్తీ సమగ్ర అభివృద్ధికి సహకరించాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: