నాలుగు రాష్ట్రాలతో సహా
పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలకు
ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఏప్రిల్ 9,ఏప్రిల్ 23,ఏప్రిల్ 29 తేదీల్లో ఎన్నికలు
మే 4న కౌంటింగ్
తెలుగు ట్రాక్ ,న్యూఢిల్లీ :
దేశంలోని అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలతో సహా కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో త్వరలోనే అసెంబ్లీ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలోనే ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహించేందుకు ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది.
ఆదివారం చీఫ్ ఎలక్షన్ కమీషనర్ జ్ఞానేశ కుమార్ ఎన్నికల జరిగే తేదీలను ప్రకటించారు.
అస్సాం, కేరళం లోని అన్ని నియోజకవర్గాలకు ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 9న ఎన్నికల నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషనర్ తెలిపారు. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కూడా అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 9 న ఎన్నికలు జరగనున్నాయి.
తమిళనాడులో ఉన్న 234 నియోజక వర్గాలకు ఒకే విడత లో ఏప్రిల్ 23న అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తారు.
పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలను రెండు దశల్లో నిర్వహిస్తారు. మొదటి దశ ఏప్రిల్ 23 రెండో దశ ఏప్రిల్ 29న జరగనున్నాయి. నాలుగు రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాల్లో జరిగే ఎన్నికల కౌంటింగ్ మే 4న నిర్వహించనున్నారు.అదే రోజు ఫలితాలను వెల్లడిస్తారు.

ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తాం
స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికల జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సిఇసి జ్ఞానేష్ కుమార్ తెలిపారు. ఓటింగ్ లో పెద్ద ఎత్తున యువత పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు ఎన్నికల షెడ్యూల్ కు ముందు ఆయా రాష్ట్రాల్లోని అన్ని పార్టీల ప్రతినిధులతో ఎన్నికల నిమిత్తం చర్చించినట్లు తెలిపారు.
ఓటరు జాబితా సవరణ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించామన్నారు. సర్ ప్రక్రియలో పాల్గొన్న అధికారులు అందరికీ అభినందనలు తెలిపారు అక్రమ ఓటర్లను ఏరి సర్ మరికొంత కాలం కొనసాగుతుందన్నారు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఓటు వేసేందుకు ఓటరు జాబితాలో చేరుస్తామన్నారు.
ఐదు రాష్ట్రాల్లో మొత్తం 17 కోట్ల 40 లక్షల మంది ఓటర్లు ఉన్నట్టు పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల్లో మొత్తం 2 లక్షల పంతొమ్మిది వేల పోలింగ్ స్టేషన్లో ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. 25 లక్షలు మంది అధికారులు ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. అన్ని పోలింగ్ స్టేషన్లో 100% నిర్వహించినట్లు చెప్పారు.
