సీనియర్ కా ? సిన్సియర్ కా ?
సిఎం పీఠంపై ఎవరు?
తెలంగాణలో విజయం సాధించి అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ సీఎం పీఠంపై ఎవరిని కుర్చోపెడుతుంది?
గత చరిత్రలో చూస్తే ఏడాదికో సీఎం లు మార్చేస్తారు అనే అపవాదు కాంగ్రెస్ పై వుంది.అధికారంలోకి వచ్చినా పార్టీలో కుమ్ములాటలు ఉంటాయి అనే అనుమానాలు ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఆ అపవాదును తప్పించుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం తర్వాత సీఎం అభ్యర్థి ఎవరో తేల్చేందుకు కొన్ని రోజులు సమయం తీసుకుంది. ఆ తర్వాత మధ్యే మార్గంగా సీనియర్ నాయకులతో సుదీర్ఘ చర్చలు జరిపిన తర్వాత సీఎం అభ్యర్థిని తేల్చారు. కర్ణాటకలో కూడా పార్టీ కోసం పనిచేసిన డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పదవిని ఆశించారు కానీ ఆ పదవిని ఇవ్వకుండానే కేవలం ఉప ముఖ్యమంత్రి పదవితోనే సరిపెట్టారు అక్కడ సీనియర్ నాయకుడుగా ఉన్న సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి పదవిపై కూర్చోబెట్టారు. ఇప్పుడు తెలంగాణలో కూడా సీఎం కుర్చీ కోసం కుమ్ములాటలు మొదలైనట్లు ఉన్నాయి దాదాపు పదిమంది సీనియర్ నేతలు ముఖ్యమంత్రి పీఠంపై కన్నేశారు. అయితే తెలంగాణలో దాదాపు కనుమరుగైపోతుందనుకున్న పార్టీ పరిస్థితినీ అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత అయితే రేవంత్ రెడ్డికే చెందుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ ను గద్దించాలనే సంకల్పంతో సిన్సియర్గా పార్టీ కోసం పనిచేశాడు అప్పట్లో సీనియర్ నాయకులతో విభేదాలు వచ్చినా గాని సర్దుకుపోయి పార్టీని అధికారంలోకి తేవాలనే ఆలోచనతోనే పనిచేశారు. రాష్ట్రమంతా తిరిగి నియోజకవర్గస్థాయి నాయకులతో కోఆర్డినేట్ చేసుకొని అవసరమైతే అక్కడ పార్టీ అభ్యర్థులను మార్చి పార్టీ గెలుపు కోసం కృషి చేశారు. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చింది.అయితే పార్టీ కార్యకర్తల్లో ఇంకా అనుమానాలు అలానే ఉన్నాయి. కర్ణాటకలో లా రేవంత్ రెడ్డికి మొండి చేయి చూపించి సీనియర్స్ కి అవకాశం ఇస్తారేమోనని అనుమానాలు రేకెత్తిస్తున్నారు. చూద్దాం సీనియర్స్ కి అవకాశం ఇస్తారో సిన్సియారిటీకి పట్టం కడతారో మరి కొద్ది నిమిషాల్లో తేలనుంది…
Kiran Kumar Udara