.
**డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారంరెండు రోజుల సస్పెన్స్ కు తెరబడింది తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు కాంగ్రెస్ అధిష్టానం తేల్చేసింది డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేతలతో ఆ పార్టీ పరిశీలకులు చర్చలు జరిపి తెలంగాణ ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డిని ఎంపిక చేసినట్లు కాంగ్రెస్ నేత కేసి వేణుగోపాల్ ఢిల్లీలో వెల్లడించారు ఈ ప్రకటన చేసేటప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేతలు బట్టి విక్రమార్క ఉత్తంకుమార్ రెడ్డి ఇద్దరు అక్కడే ఉన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి పదవి కోసం పోటీపడిన వారిలో వీళ్ళిద్దరి పేర్లు ప్రముఖంగా వినబడ్డాయి వీరు ఇరువురితో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాణిక్రావు , కేసీ వేణుగోపాల్ వంటి సీనియర్ నేతలతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా చర్చలు జరిపారు. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందర్నీ ఒప్పించిన తర్వాతే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం విశేషం వాస్తవానికి ముఖ్యమంత్రి అభ్యర్థిని తేల్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఇంకా సమయం తీసుకుంటుంది అనుకున్నారు కానీ కేవలం రెండు రోజుల్లోనే ముఖ్యమంత్రిగా రేవంత్ ను ఎంపిక చేయటం జరిగింది. అయితే రేవంత్ ను సీఎల్పీ నాయకుడిగా ఎన్నుకున్నామని ప్రకటించిన అనంతరం హైదరాబాదు నుండి రేవంత్ ఢిల్లీకి ప్రయాణమయ్యారు సోనియాగాంధీ రాహుల్ గాంధీని ఈనెల ఏడవ తారీఖున జరిగే ప్రమాణస్వీకారానికి ఆహ్వానించడానికి వెళ్లారు. అక్కడ తెలంగాణ క్యాబినెట్లో మంత్రులుగా ఎవరెవరిని ఎంపిక చేయాలని విషయం కూడా చర్చించే అవకాశం ఉంది.