కొత్త స్పీకర్‌గా ప్రసాద్

Spread the love

తెలంగాణ అసెంబ్లీ నూతన స్పీకర్‌ గా గడ్డం ప్రసాద్‌ కుమార్‌ పేరును ఖరారు చేశారు. కాంగ్రెస్‌ అధిష్టానం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆయన వికారాబాద్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో ఆయన అభిమానులు, కాంగ్రెస్‌ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. తొలుత దుద్దిళ్ల శ్రీధర్‌ బాబును స్పీకర్‌ గా నియమిస్తారని వార్తలు వచ్చాయి. అయితే, ఆయన ఆ పదవి చేపట్టేందుకు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ను స్పీకర్‌ పదవికి ఎంపిక చేశారు.

అసెంబ్లీ స్పీకర్‌ అంటేనే భయం
తెలుగు రాష్ట్రాల్లో ఈ పదవి అంటేనే అందరికీ చేదు అనుభవం గుర్తుకు వస్తుంది. ఎందుకంటే, ఇప్పటివరకూ ఈ పదవి చేపట్టిన ఏ ఎమ్మెల్యే కూడా తర్వాత ఎన్నికల్లో గెలిచిన దాఖలాలు లేవు. అందుకే ఆ పదవి చేపట్టేందుకు ఎవరూ సుముఖత వ్యక్తం చేయరు. అవసరం అయితే, నామినేటెడ్‌ పదవులను తీసుకునేందుకు సిద్ధంగా ఉంటారు. అయితే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ చరిత్రను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ తిరగరాశారు. 2018లో టీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన స్పీకర్‌ పదవి చేపట్టారు. తాజాగా, 2023 ఎన్నికల్లోనూ బాన్సువాడ నుంచి బీఆర్‌ఎస్‌ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఈ క్రమంలో స్పీకర్‌ పదవికి ఉన్న ఆ పేరు తొలిగినట్లయింది. పోచారం గెలుపుతో ఇక స్పీకర్‌ పదవి చేపట్టేందుకు ఎవరూ వెనకాడరనే భావించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: