తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేసారు. ఈ రోజు బుధవారం అసెంబ్లీలో గత ప్రభుత్వం చేసిన అప్పులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసింది. ఇప్పటి వరకు మొత్తం తెలంగాణకు రూ. 6,71,757 కోట్లు అప్పులు ఉన్నట్లు అందులో ప్రకటించారు. తెలంగాణ ఏర్పడే నాటికి కేవలం రూ. 72,658 కోట్ల రూపాయల ఋణం మాత్రేమే ఉన్నట్లు ప్రకటించారు. ఆంధ్ర ప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్ర విభజన జరిగిన అనంతరం 24.5 శాతం ఋణం పెరిగినట్లు అందులో తెలిపారు. ఎన్నికల సభల్లో కాంగ్రెస్ నేతలు ప్రకటించినట్లు తెలంగాణాలో గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం చేసిందని అందులో వివరించారు.