ఇజ్రాయేల్ లో తెలుగువారి కోసం హెల్ప్ లైన్లు

Spread the love

ఇజ్రాయెల్ లో ఉన్న భారతీయుల సహాయార్థం భారత రాయబార కార్యాలయం (ఇజ్రాయెల్), మరియు రాష్ట్ర ప్రభుత్వ సంస్థ APNRTS హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేసింది.

ఇజ్రాయెల్ లో ప్రస్తుతం పరిస్థితుల దృష్ట్యా శాంతి భద్రతలపై ఆందోళన నెలకొన్నందున భారత రాయబార కార్యాలయం భారతీయుల సంక్షేమము కొరకు ముఖ్య సూచనలు చేసింది.

A view shows houses and buildings destroyed by Israeli strikes in Gaza City, October 10, 2023. REUTERS/Mohammed Salem TPX IMAGES OF THE DAY

ఇజ్రాయెల్ లోని భారతీయ పౌరులు అప్రమత్తంగా ఉండాలని మరియు ఇజ్రాయెల్ ప్రభుత్వ భద్రతా నియమాలను గమనించి జాగ్రత్త వహించాలని, అనవసరమైన ప్రయాణాలను విరమించుకోవాలని మరియు స్థానిక ప్రభుత్వ అధికారులు సూచించిన విధంగా సురక్షిత ప్రదేశాలకు దగ్గరగా ఉండాలని ఇజ్రాయిల్ లోని భారత రాయబార కార్యాలయం భారతీయ పౌరులకు సూచనలను విడుదల చేసింది. ఇజ్రాయెల్ లో పరిస్థితి క్షీణించినప్పుడు, స్వదేశానికి తిరిగి రావాల్సిన అవసరం ఏర్పడితే ప్రవాసాంధ్రులను సురక్షితముగా వెనక్కి తీసుకురావటానికి మరియు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వారి కుటుంబాలకు సహాయం చేయడానికి APNRTS సిద్ధంగా ఉన్నట్లు ఇజ్రాయెల్ లోని భారత రాయబార కార్యాలయం కి ఇమెయిల్ రాయడం జరిగింది.

ఇజ్రాయెల్ వెళ్లాలని అనుకునే వారు కూడా అక్కడి పరిస్థితులు సాధారణ స్థాయికి వచ్చే వరకు తమ ప్రయాణమును వాయిదా వేసుకోవాలని సూచించారు.

ఇజ్రాయెల్ లో ఉన్న భారతీయ పౌరులు అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం మరియు వారి వివరాల నమోదు కొరకు భారత రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ నెంబర్: +972 35226748 లేదా ఇమెయిల్ cons1.telaviv@mea.gov.in ను సంప్రదించవచ్చు.

ఆంధ్రప్రదేశ్ కు చెందినవారు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన APNRTS 24/7 హెల్ప్ లైన్ నంబర్లు +91 8500027678 (వాట్సాప్), 0863 2340678 ను సంప్రదించగలరు. అలాగే, మీ కుటుంబసభ్యులు లేదా మిత్రులు లేదా తెలిసిన వారు ఎవరైనా ఇజ్రాయెల్ లో ఉంటే, APNRTS 24/7 హెల్ప్ లైన్ నంబర్లను సంప్రదించి వివరాలు తెలపగలరని కోరారు .

One thought on “ఇజ్రాయేల్ లో తెలుగువారి కోసం హెల్ప్ లైన్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: