అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు ఈ లాయర్లు వాదించారు. అయితే కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వ తరఫు లాయర్లు సమయం కోరడంతో ఈ నెల 21కి న్యాయస్థానం వాయిదా వేసింది. మరోప్రక్క స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరుగుతోంది.మరి కొద్దీ సేపట్లో రిమాండ్ పిటీషన్ పై కోర్టు నిర్ణయం వెల్లడించనుంది.

చంద్రబాబు క్వాష్ పిటిషన్‍పై కొనసాగుతున్న వాదనలు
రిమాండ్ పిటీషన్ పై హరీష్ సాల్వే వర్చువల్‍గా వాదనలు వినిపిస్తున్నారు.ఆర్టికల్ 17 ఏ ప్రకారం చంద్రబాబు అరెస్టులో గవర్నర్ అనుమతి తీసుకోలేదని తెలిపారు. అందుకు స్టేట్ ఆఫ్ రాజస్థాన్ వర్సెస్ తేజ్‍మాల్ చౌదరి కేసును ప్రస్తావించారు. సుప్రీంకోర్టు పలు తీర్పులను సైతం ప్రస్తావించారు. ఆర్నబ్ గోస్వామి కేసును పరిశీలించాలని కోరారు. మొత్తానికి చంద్రబాబు రిమాండ్ చట్ట విరుద్దమని హరీష్ సాల్వేవినిపించారు. కాగా సీమెన్స్ ప్రాజెక్టులోని ముఖ్యమైన పాయింట్లను చంద్రబాబు తరపు న్యాయవాదులు వివరిస్తున్నారు