అభివృద్ధి చేయడమే చంద్రబాబు చేసిన నేరమా?

Spread the love

చంద్రబాబుకు మద్దతుగా కదంతొక్కిన రాజమండ్రి ప్రజలు
కొవ్వొత్తుల ర్యాలీకి భారీగా తరలివచ్చిన మహిళలు
నిర్దోషిగా చంద్రబాబు బయటకు వస్తారు
న్యాయ వ్యవస్థపై మాకు పూర్తి నమ్మకం ఉంది
కుదేలైన రాష్ట్రానికి చంద్రబాబు అవసరం చాలా ఉంది
క్యాండిల్ లైట్ ర్యాలీలో పాల్గొన్న భువనేశ్వరి, బ్రాహ్మణి

రాజమండ్రి: మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ మహిళలు భారీగా వచ్చి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. రాజమహేంద్రవరం తిలక్ రోడ్డులోని సాయిబాబా ఆలయం నుండి శ్యామలానగర్ రామాలయం జంక్షన్ వరకు నిర్వహించిన ప్రదర్శనకు నగరం నలుమూలల నుంచి వేలాది మహిళలు స్వచ్చందంగా తరలివచ్చారు. నగరానికి చెందిన మహిళలు,
ప్రముఖులు, సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున హాజరై చంద్రబాబునాయుడుకు సంఘీభావం తెలిపారు. చంద్రబాబునాయుడు తక్షణం విడుదల చేయాలంటూ నినాదాలతో నగర వీధులు హోరెత్తాయి. ర్యాలీ అనంతరం శ్యామలానగర్ రామాలయం వద్ద నారా బ్రాహ్మణి విలేకరులతో మాట్లాడుతూ…చంద్రబాబునాయుడును అక్రమంగా అరెస్టు చేసిన రోజు భారతదేశ ప్రజాస్వామ్యానికి చీకటి రోజు. ఆయన 42 సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగిన తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేసిన విజనరీ, భారతదేశానికి ఐటీని తెచ్చిన దార్శనికుడు, నీతి నిజాయితీగా రాష్ట్రప్రజల కోసం కష్టపడిన చంద్రబాబుగారి లాంటి సీనియర్ నాయకుడిని ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్టు చేయడం అక్రమం అన్నారు. ఇలాంటి పరిణామం చూసి ఓ యువతిగా నేను చాలా బాధపడుతున్నానన్నారు. చంద్రబాబు వంటి సీనియర్ నాయకుడికే రాష్ట్రంలో ఇంత అన్యాయం జరుగుతుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటో రాష్ట్ర ప్రజలంతా ఆలోచించాలన్నారు. . చంద్రబాబు వంటి నాయకుడు లేకపోతే యువతీ యువకులకు నైపుణ్యం, ఉద్యోగాలు వచ్చేవా? అభివృద్ధి చేయడం, సంక్షేమం అందించడం, ఉద్యోగాలు ఇవ్వడమే చంద్రబాబు చేసిన నేరమా? అని ప్రశ్నించారు.

మేం ఎప్పుడూ ఒంటరి వాళ్లం కాదు..
రాష్ట్రప్రజలు, తెలుగుదేశంపార్టీ కుటుంబ సభ్యులు మాకు అండగా ఉన్నారు. చంద్రబాబులాంటి వ్యక్తిని అరెస్టు చేస్తారని, మేం ఇలా రోడ్డుపైకి వచ్చి పోరాడాల్సి వస్తుందని ఊహించలేదన్నారు. . చంద్రబాబు జైల్లో, లోకేష్ ఢిల్లీలో, మేం రాజమండ్రిలో, మా కుమారుడు దేవాన్ష్ హైదరాబాద్ లో ఉండాల్సిన పరిస్థితులు కల్పించారన్నారు. . చంద్రబాబు ఐటీని తెచ్చి, రాష్ట్ర ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించినందుకు ఇచ్చే ప్రతిఫలం ఇదేనా?అని ప్రశ్నించారు. . చంద్రబాబు పర్యటనలకు రాష్ట్రవ్యాప్తంగా విపరీతమైన స్పందన వస్తోంది. దీన్ని ఓర్చుకోలేక మాపై కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు. . మరో 6నెలల్లో ఎన్నికలు రాబోతున్నందున ప్రభుత్వంపై ప్రజల్లో పెల్లుబుకుతున్న వ్యతిరేకత తట్టుకోలేక చంద్రబాబును నిరాధార ఆరోపణలు చేసి అరెస్టు చేశారన్నారు.
. లోకేష్ యువగళం పాదయాత్రకు యువత పెద్దఎత్తున స్పందన రావడం కూడా ప్రభుత్వ కక్షసాధింపునకు ఒక కారణం అన్నారు.

లోకేష్ ను కూడా నేడో రేపో అరెస్టు చేయాలని చూస్తున్నారు. తప్పుచేయని మేం ఎవరికీ భయపడం. మా వెనుక 5కోట్లమంది ఆంద్రప్రదేశ్ ప్రజలు, బలమైన టీడీపీ కుటుంబం ఉందన్నారు. . మాలో పోరాట స్ఫూర్తి ఉంది. మాకు న్యాయ వ్యవస్థపై అపారమైన నమ్మకం ఉందన్నారు.చంద్రబాబు నిర్ధోషిగా బయటకు వస్తారని నాకు నమ్మకం ఉంది. చంద్రబాబు బయటకు రావాలి, ఏపీకి న్యాయం జరగాలి. దీనికోసం మా పోరాటం కొనసాగుతుందన్నారు. చంద్రబాబునాయుడు కియా, జోహో వంటి అనేక పరిశ్రమలు, కంపెనీలు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. చంద్రబాబు తప్పు చేయలేదని యావత్ దేశం నమ్ముతోందన్నారు. . అందుకే ప్రపంచవ్యాప్తంగా తెలుగుప్రజలు రోడ్ల మీదకు వచ్చి చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తున్నారని బ్రాహ్మణి అన్నారు. మీడియాతో మాట్లాడిన అనంతరం శ్యామలాపురం రామాలయం జంక్షన్ వద్దనున్న సీతారాములవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసి ర్యాలీని ముగించారు. కార్యక్రమంలో మాజీమంత్రి గోరంట్ల బుచ్చయ్యచౌదరి, గన్ని కృష్ణ, ఆదిరెడ్డి వాసు, ఆదిరెడ్డి అప్పారావు, రాజమహేంద్రవరం టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: