
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు రిమాండ్ పై వేసిన క్వాష్ పిటీషన్ పై చంద్రబాబు తరుపున వాదనలు భోజన విరామ సమయానికి ముగిసాయి. చంద్రబాబు తరుపున హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. బాబును అక్రమంగా అరెస్ట్ చేశారని, ఎఫ్ ఐ ఆర్ లో పేరు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ,అవినీతి నిరోధక చట్టం ప్రకారం సి ఐ డి చట్టాన్ని సక్రమంగా పాటించలేదని వాదించారు.
అయితే మధ్యాహ్న విరామ అనంతరం సి ఐ డి తరుపు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తున్నారు. . చంద్రబాబును అరెస్ట్ చేసి కేవలం పది రోజులే అయినందున ఈ పిటీషన్ ను ఇప్పుడే విచారించవద్దని కోర్టును కోరారు. బాబు తరుపున లాయర్లు 900 పేజీల డాక్యుమెంట్ ను కోర్టుకు ఇచ్చినందున వాటిని క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. పథకం ప్రకారమే ఈ స్కామ్ జరిగిందని దీనిపై చాల లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని ,అప్పటి వరకు పిటీషన్ విచారించాల్సిన అవసరం లేదని కోర్టుకు తెలిపారు. చంద్రబాబు వేసిన క్వాష్ పిటీషన్ పై వాదనలు కొనసాగుతున్నాయి