కొత్త పార్లమెంట్‌ భవనంలోనే సమావేశాలు

Spread the love

పార్లమెంట్‌ పాత భవనం శకం సోమవారం సమావేశాలతో ముగిసింది. ఈరోజు ఉదయం గణపతి పూజతో పార్లమెంట్ ప్రారంభం అయ్యింది. మధ్యాహ్నాం 1.15 నిమిషాలకు లోక్‌సభ ప్రారంభం అయింది. మరోవైపు రాజ్యభస 2.15 నిమిషాలకు ప్రారంభం అయిందిది. రాజ్యాంగ పరిషత్‌ ఏర్పడిన నాటి నుంచి పార్లమెంటరీ ప్రయాణం నేటితో 75 ఏళ్లు పూర్తి చేసుకుంది.
II రాజ్యసభ, లోక్‌సభ సభ్యులకు మంగళవారం ఉదయం 11 గంటలకు కొత్త పార్లమెంట్‌ భవనంలోని సెంట్రల్‌ హాల్‌లో సమావేశమైంది అంతకంటే ముందు ఉదయం 9:30 గంటలకు కొత్త ప్రాంగణంలో లోక్‌సభ, రాజ్యసభ ఎంపీల గ్రూప్‌ ఫోటో సెషన్‌ నిర్వహించారు. కొత్త భవనం చాలా ప్రత్యేకతలను కలిగి ఉంది. అక్కడ ఎంపీల మైక్‌లన్నీ ‘ఆటోమేటెడ్‌ వ్యవస్థ’ సాయంతో పని చేస్తాయని సమాచారం. అంటే ఎవరైనా ఎంపీ మాట్లాడేందుకు స్పీకర్‌ సమయం కేటాయిస్తే.. ఆ నిర్దేశిత సమయం పూర్తి కాగానే మైక్రోఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ అవుతుంది. కొత్త పార్లమెంటులో బయోమెట్రిక్‌ భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొత్త అత్యాధునిక భవనానికి తరలింపు జరగనుంది. ఇందులో సెప్టెంబర్‌ 22 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి.
కొత్త పార్లమెంట్‌ భవనం ప్రత్యేకతలు
IIకొత్త పార్లమెంట్‌ భవనంలో సీటింగ్‌ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచారు. ఎగువ సభ అయిన రాజ్యసభలో సీటింగ్‌ 250 నుంచి 384కి పెంచారు. దిగువ సభ లోక్‌సభ సీటింగ్‌ను 888 సీట్లకు పెంచారు. గతంలో సీటింగ్‌ 550గా ఉండేది.
IIఉమ్మడి సెషన్‌లో, లోక్‌సభ ఛాంబర్‌లో 1,272 మంది సభ్యులు ఉండవచ్చు. భవనంలోని మిగిలిన నాలుగు అంతస్తులలో మంత్రి కార్యాలయాలు, కమిటీ గదులు రూపొందించబడ్డాయి. పార్లమెంట్‌ ఇంటీరియర్‌ మూడు జాతీయ చిహ్నాలను సూచిస్తుంది: కమలం, స్వచ్ఛత, జ్ఞానోదయాన్ని సూచిస్తుంది. నెమలి భారతదేశ జాతీయ పక్షిని, మర్రి చెట్టు, దీర్ఘాయువు, అమరత్వానికి చిహ్నంగా నిలుస్తాయి.
IIరాజ్యసభ ఛాంబర్‌ నిర్మాణం జాతీయ పుష్పం కమలం నుంచి ప్రేరణ పొందింది. లోక్‌సభ ఛాంబర్‌ ఆకర్షణీయమైన నెమలి థీమ్‌ను ప్రదర్శిస్తుంది. వాస్తుశిల్పం, జాతీయ ప్రతీకవాదం కలిసిన ఈ భవనం భారతదేశం సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. గంభీరమైన మర్రి చెట్టు డిజైన్‌తో అలంకరించబడిన బహిరంగ ప్రాంగణం భవనం శోభను పెంచుతుంది.
IIభారతీయ సంప్రదాయాల్లో మరో ముఖ్యమైన అంశం సెంగోల్‌. ఇది బ్రిటీష్‌ వారి నుంచి భారతీయులకు అధికార మార్పిడిని సూచిస్తుందా లేదా అనే దానిపై గతంలో అధికార ఔఆం, ప్రతిపక్ష పార్టీల మధ్య వివాదం రేపింది.
IIకొత్త పార్లమెంటు భవనం మౌలిక సదుపాయాల భద్రతకు ప్రాధాన్యతనిస్తుంది. ఢల్లీిలో భూకంప కార్యకలాపాలను తట్టుకునేలా రూపొందించబడిరది. ఇది సీస్మిక్‌ జోన్‌ఎప కిందకు వస్తుంది. చట్టసభ సభ్యులు, సందర్శకుల క్షేమం కోసం భూకంప జోన్‌ప ప్రమాణాల మేరకు నిర్మించారు.
IIపెద్ద కమిటీ గదులు అత్యాధునిక ఆడియో`విజువల్‌ సిస్టమ్‌లతో అమర్చబడి ఉంటాయి. అయితే సమావేశ గదులలో గ్రాఫికల్‌ ఇంటర్‌ఫేస్‌లు, బయోమెట్రిక్‌లు, స్మార్ట్‌ డిస్‌ప్లేలు ఉంటాయి. ఇవి ఓటింగ్‌ ప్రక్రియను సులభతరం చేస్తాయి.
IIఈ భవనంలో మంత్రి మండలి కోసం 92 గదులు, ఆరు కమిటీ గదులు, ఒక ప్రాంగణం నిర్మించారు. ఇవి పార్లమెంటు సభ్యుల మధ్య పరస్పర చర్యలను సులభతరం చేస్తాయి. ముఖ్యంగా ఇది భారతదేశ వారసత్వానికి ప్రతిబింబించేలా ‘రాజ్యాంగ సభ’ను కలిగి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: