చంద్రబాబు కు 24 వరకు జ్యుడీషియాల్ రిమాండ్ పొడిగిస్తూ ఏ సి బి కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ రోజు రిమాండ్ గడువు ముగియడంతో చంద్రబాబు ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ముందు హాజరు పరిచారు. ఈ సందర్భంగా చంద్రబాబు తన ఆవేదనను జడ్జికి తెలిపారు. జైలులో ఉంచి తనను మానసికంగా వేధిస్తున్నారని చెప్పారు. కేసులో నోటీసులో కూడా ఇవ్వకుండా అక్రమంగా అరెస్టు చేశారని న్యాయమూర్తికి తెలిపారు. అందుకు జడ్జి స్పందిస్తూ మీ పై ఉన్నవి కేవలం ఆరోపణలేనని ఇందులో మీరు నేరస్థుడుగా నిర్దారణ కాలేదని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. మరోప్రక్క చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలన్న ఏపీ సి ఐ డి పిటీషన్ పై తీర్పును ఈ రోజు మధ్యాహ్నం కు వాయిదా వేశారు. హై కోర్టులో క్వాష్ పిటీషన్ పై తీర్పు వచ్చాక కస్టడీ పై నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
