స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించింది. శనివారం, ఆదివారం రెండ్రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్న సి ఐ డి అధికారులు, ఆదివారం సాయంత్రం ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రవేశపెట్టారు.న్యాయమూర్తి ఈ సందర్భంగా చంద్రబాబును పలు ప్రశ్నలు అడిగి వివరాలు తెలుసుకున్నారు. విచారణ సమయంలో అధికారులు తనను ఏమైనా ఇబ్బంది పెట్టారా ,థర్డ్ డిగ్రీ ప్రయోగించారా అని అడిగారు. అందుకు బాబు అటువంటిదేమీ లేదని చెప్పారు. తానేం నేరం చేయలేదని,న్యాయమూర్తికి స్పష్టం చేశారు. కాగా చంద్ర బాబు పై రెండు వేళా పేజీల్లో,ఆరువందల అభియోగాలున్నాయని న్యాయమూర్తి ఆయనకు వెల్లడించారు. చంద్రబాబుపై మోపిన అభియోగ పత్రాలను అయన తరపు న్యాయవాదులకు అందజేయాలని సి ఐ డి కి సూచించారు. చంద్రబాబును మరిన్ని రోజులు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టును సీఐడీ ఆశ్రయించింది.అయితే కస్టడీ ఇచ్చే విషయం ఇప్పటికైతే కుదరదు,పిటీషన్ వేస్తే పరిశీలించి చెప్తానన్నారు. కస్టడీ విషయంపై నిశితంగా సీఐడీ వివరణ ఇవ్వడం.. ఇటు చంద్రబాబు తరఫు లాయర్లు వాదనలు జరిగాయి. ఇరువర్గాల వాదనలు విన్నాక చంద్రబాబుకు అక్టోబర్ 5 వరకు రిమాండ్ పొడిగిస్తున్నట్లు ఏసీబీ కోర్టు తీర్పు వెల్లడించింది.
