
రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొన్న వైద్య సిబ్బంది
జగనన్న సురక్ష ఆరోగ్య శిబిరాలకు ఐఎంఎ సహాకారం
సీఎం జగన్ ను సత్కరించిన ఐఎంఏ రాష్ట్ర శాఖ
సీఎం జగన్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐఎంఏ వినతిపత్రం
రాష్ట్రవ్యాప్తంగా జగనన్నఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా సాగుతుంది. ప్రతి గ్రామంలోనూ వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. వైద్య సిబ్బంది అత్యంత సేవా భావంతో తమ వైద్య సేవలందిస్తున్నారు. ఎక్కడిక్కడ రోగులకు పరీక్షలు నిర్వహిస్తూ ,అవసరమైన మందులను అందజేస్తున్నారు. ఈ సందర్భంగా తాడేపల్లి లోని సీఎం క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్న జగనన్న సురక్ష ఆరోగ్య శిబిరాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, ఐఎంఏ రాష్ట్ర కోశాధికారి డాక్టర్. ఎం. రవీంద్రనాథ్ పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 98 ఐఎంఏ శాఖలలో ఐఎంఏ స్పెషలిస్ట్ వైద్యులు జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాల వెబ్ సైట్ లో పేర్లు నమోదు చేసుకుని పాల్గొనాలని రాష్ట్ర ఐఎంఏ చేసిన విజ్ఞప్తి మేరకు ఐఎంఏ వైద్యులు రాష్ట్ర వ్యాప్తంగా ఈ శిబిరాల్లో పాల్గొంటున్నారని ముఖ్యమంత్రికి డాక్టర్ రవి కృష్ణ తెలిపారు. స్పందించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఐఎంఏ వైద్యులకు ధన్యవాదాలు తెలియజేయమని కోరారు. ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ ముఖ్యమంత్రితో మాట్లాడుతూ దేశంలో మరెక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మకమైన చర్యలు చేపట్టడం ద్వారా అదేవిధంగా ఆరోగ్యశ్రీ పరిధిని విస్తృతం చేయడం, చికిత్స తర్వాత కోలుకునే సమయంలో ఆసరా సహకారం అందించడం, డాక్టర్ వైయస్సార్ విలేజ్ ,అర్బన్ క్లినిక్ లు, ఫ్యామిలీ డాక్టర్ విధానం, 17 నూతన వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టి ఐదు వైద్య కళాశాలలు ఈ సంవత్సరం ప్రారంభించి తద్వారా ఆ ప్రాంత ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి రావడానికి దోహదం చేశారని, ఇప్పుడు జగనన్న ఆరోగ్య సురక్ష ఆరోగ్య యజ్ఞానికి నాంది పలికిన సందర్భంగా ఐఎంఏ రాష్ట్ర శాఖ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ శాలువా, సాంప్రదాయ మైసూర్ పేట తలపాగా, పూలగుచ్చం అందించి సత్కరించారు.ఈ సందర్భంగా ఐఎంఏ రాష్ట్ర శాఖ తరపున వైద్యులు, ఆసుపత్రుల సమస్యలపై ముఖ్యమంత్రికి వినతి పత్రాన్ని అందజేశారు. ముఖ్యమంత్రి వినతిపత్రాన్ని ఆరోగ్య శాఖ కార్యదర్శి కృష్ణ బాబుకు అందజేసి వాటిని పరిశీలించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ఐఎంఏ ఆధ్వర్యంలో విజయవాడలో నవంబర్ 22 నుండి 26 వరకు జాతీయస్థాయి వైద్యుల క్రీడా ఒలంపిక్స్ నిర్వహిస్తున్నామని డాక్టర్ రవి కృష్ణ ముఖ్యమంత్రి కి పోటీల వివరాలు తెలియజేసి క్రీడలకు సంబంధించిన లోగోను ఆవిష్కరించడానికి అపాయింట్మెంట్ కోరడం జరిగింది