ఇప్పటి వరకు ఏమీ కలిసిరాక అన్నింటిలో ఎదురు దెబ్బ తగులుతున్న చంద్రబాబు కు ఆంధ్రప్రదేశ్ హై కోర్టులో ఊరట లభించింది. ఇన్నర్ రింగ్ రోడ్ లో బాబును అరెస్ట్ చేయొద్దని హై కోర్టు ఆదేశాలిచ్చింది. అంగళ్ళు కేసులో కూడా రేపటి వరకు ఏ విధమైన తొందరపాటు చర్యలు చేపట్టొదని తెలిపింది.ఈ రెండు కేసుల్లో చంద్రబాబు మధ్యంతర బెయిలు లభించింది. అయితే చంద్రబాబు కు ఏపీ హై కోర్టులో ఊరట లభించినప్పటికీ రాజమండ్రి జైలులోనే ఉండనున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్ర బాబు వేసిన క్వాష్ పిటీషన్ ను శుక్రవారానికి వాయిదా పడింది. శుక్రవారం కూడా వాదనలు మాత్రమే వినే అవకాశం ఉంది. అదే రోజు తీర్పు వచ్చే అవకాశం లేనట్లు కనిపిస్తుంది. ఒకవేళ ఆ కేసులో కనుక చంద్రబాబుకు అనుకూలంగా వస్తే ఆయన జైలులో నుండి బయటకు వచ్చే అవకాశాలే ఎక్కువ .
