
అసలు బెయిలు పిటీషన్ లో ఏముంది.
ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టులో చంద్రబాబు కు గట్టి షాక్ తగిలింది.అంగళ్ళు,ఫైబర్ గ్రిడ్ ,ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో వేసిన ముందస్తు బెయిలు పిటీషన్లను అన్నింటినీ ఏపీ హై కోర్టు తిరస్కరించింది. వాస్తవానికి అంగళ్ళు కేసులో ఇప్పటి వరకు కేసుల్లో ఉన్నవారికి అందరికి ఇప్పటికే బెయిలు వచ్చింది. దీంతో చంద్రబాబుకు కూడా తేలికగానే బెయిలు వచ్చే అవకాశం ఉందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా ఈ కేసులో కూడా చంద్రబాబు ముందస్తు బెయిలునుపిటీషన్లను కొట్టి వేస్తూ ఆదేశాలిచ్చింది.
ఇప్పటికే చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి రిమాండ్ ను ఛాలెంజ్ చేస్తూ చంద్రబాబు తరుపున న్యాయవాదులు హై కోర్టులో కేసు వేయగా ఏపీ హై కోర్టు చంద్రబాబు క్వాష్ పిటీషన్ ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. దీనిపై ఆయన సుప్రీం కోర్టుకు వెళ్లారు. అక్కడ సోమవారం లేదా మంగళవారం లో తీర్పు వచ్చే అవకాశం ఉంది. అక్కడ చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తే స్కిల్ డెవలప్ మెంట్ కేసు లో ఆయన బయట పడినట్లే.
కానీ మిగిలిన మూడుకేసుల్లో చంద్రబాబును మళ్ళి అరెస్ట్ చేసి జైలులోనే ఉంచుతారు అనే అనుమానంతో చంద్రబబు తరుపున న్యాయవాదులు ముందస్తు బెయిలు కోసం కోర్టుకు వెళ్లారు. ఆయా కేసుల్లో సి ఐ డి కూడా పిటి వారెంట్ కోసం కోర్టులో అప్లై చేసింది. చంద్రబాబు తరుపు న్యాయ వాదులు అందుకే ముందస్తు బెయిలు కోసం వెళ్లారు. అందులో ఇప్పుడు చంద్రబాబు స్కిల్ కేసులో రిమాండ్ లో ఉన్నారు కాబట్టి ,ఈ మూడు కేసుల్లో కూడా “డీమ్డ్ టు కస్టడీ” అని భావించాలని కోరారు . అందుచేత న్యాయమూర్తి సంకేతిక కారణాలను చూపి మూడు ముందస్తు బెయిలు పిటీషన్లను కొట్టివేశారు.