స్వాగతం చెప్పేందుకు దారి పొడవునా టీడీపీ కార్యకర్తల ఏర్పాట్లు
48 నియోజక వర్గాలు కలిసేలా ఊరేగింపుకు ప్లాన్లు
రాత్రి కి విజయవాడ రానున్న చంద్రబాబు

చంద్రబాబుకు హై కోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిలు ఉత్తర్వులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరాయి. బెయిలు ఉత్తర్వులలో నిబంధనలను చంద్రబాబుకు అక్కడి జైలు అధికారులు చదివి వినిపిస్తారు. అందులోని కండిషన్లపై చంద్రబాబుతో సంతకాలు చేయించుకుంటారు. ఆ తర్వాత జైలు నియమాలను పూర్తి చేసి చంద్రబాబును విడుదల చేస్తారు.
చంద్రబాబు జైలునుండి ఉండవల్లి లోని అయన గృహానికి చేరుకునేందుకు రోడ్డు మార్గంలోనే ప్రయాణించనున్నారు. రాజమండ్రి నుండి ఉండవల్లి వరకు మధ్యలో ఉన్న 48 నియోజక వర్గాల టీడీపీ నాయకులూ ఆయనకు స్వాగతం చెప్పేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అక్కడ నుండి చంద్రబాబు ఊరేంగింపు గానే వచ్చే అవకాశం వుంది అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఎక్కడా ఆగకుండా ,తక్కువ వేగంతో వచ్చే అవకాశం ఉంది. నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం 3 గంటలకు విడుదలైతే 8 గంటలకు గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుండి రామవరప్పాడు రింగు,కనకదుర్గ వారధి గుండా ఉండవల్లి చేరుకుంటారు. విజయవాడ సిటీ లోనే దాదాపు 2 గంటల పాటు ప్రయాణించేలా షెడ్యూల్ సిద్ధం చేసుకున్నారు