భారీగా తరలి వచ్చిన పార్టీ కార్యకర్తలు
రాజమండ్రిలో 144 సెక్షన్ అమలు
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మధ్యంతర బెయిలు రావడంతో చంద్రబాబు జైలు నుండి విడుదలయ్యారు. గత 52 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులోనే ఉన్న చంద్ర బాబు కోర్టు ఉత్తర్వులతో బయటకు వచ్చారు. అయితే బెయిలు పై కొన్ని షరతులను విధించింది. సాధారణ నిబంధనలతో పాటు ర్యాలీలు నిర్వహించకూడదని ,మీడియా తో మాట్లాడవద్దని సి ఐ డి మెమో దాఖలు చేయడంతో హై కోర్టు రేపటి వరకు ర్యాలీలు నిర్వహించొద్దని ఆదేశాలిచ్చింది. బెయిలు విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో సెంట్రల్ జైలు వద్దకు చేరుకున్నారు. కోర్టు షరతులకు అనుగుణంగా చంద్ర బాబు బయటకు వచ్చాక ర్యాలీలు నిర్వహించకుండా నడుచుకుంటూనే బయటకు వచ్చారు. ఆయన కోసం అక్కడ వేచి వున్న నాయకులూ,కార్యకర్తలను ఆప్యాయంగా పలకరించారు.