వన్డే ప్రపంచకప్ 2023లో సెవిూస్ ఆడే జట్లు ఏవో దాదాపు ఖరారు అయ్యాయి. ఇప్పటికే భారత్, సౌతాఫ్రికా, ఆసీస్ సెవిూస్ బెర్త్ ఖరారు చేసుకోగా.. తాజాగా న్యూజిలాండ్ నాలుగో టీమ్‌గా సెవిూస్‌కు అర్హత సాధించింది. శ్రీలంకతో గురువారం జరిగిన మ్యాచ్‌లో భారీ విజయం సాధించిన న్యూజిలాండ్.. పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌లను వెనక్కనెట్టి సెవిూస్‌కు దూసుకెళ్లింది.అద్భుతం జరిగితే తప్పా న్యూజిలాండ్ సెవిూస్ బెర్త్‌కు వచ్చే డోకా లేదు. పాకిస్థాన్ సెవిూస్ చేరాలంటే క్రికెట్ చరిత్రలోనే కనివీని ఎరుగని విజయం అంత తేలిక కాదు.ముందుగా బౌలింగ్ చేస్తే మాత్రం ఇంగ్లండ్‌ను 50 పరుగులకు ఆలౌట్ చేసి 2.3 ఓవర్లలో చేధించాలి. ఏ లెక్కన చూసుకున్నా.. ఇది అసాధ్యం. మాజీ ఛాంపియన్ ఇంగ్లండ్ ఈ టోర్నీలో విఫలమైనా.. నెదర్లాండ్స్‌పై సాధించిన భారీ విజయంతో ఆ జట్టు ఫామ్‌లోకి వచ్చింది. పాకిస్థాన్ తలకిందులు తపస్సు చేసినా.. సెవిూస్ చేరలేదుఈ క్రమంలోనే న్యూజిలాండ్ సెవిూస్ బెర్త్ ఖరారు అయినట్లేనని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారత్ సెవిూఫైనల్ అభ్యర్థి కూడా న్యూజిలాండేనని స్పష్టం చేస్తున్నారు. నవంబర్ 15న ముంబై వేదికగా జరిగే తొలి సెవిూఫైనల్లో భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. 16న కోల్‌కతా వేదికగా జరిగే రెండో సెవిూఫైనల్లో సౌతాఫ్రికా, ఆసీస్ జట్లు అవిూతువిూ తేల్చుకోనున్నాయి.
Related Posts
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడి అరెస్టు
- kiran
- September 9, 2023
- 0
Spread the love స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని సీఐడీ పోలీసులు అరెస్టు […]
మరో ఎన్నికల సమరం
- kiran
- March 15, 2026
- 0
Spread the loveనాలుగు రాష్ట్రాలతో సహాపుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలకుఎన్నికల షెడ్యూల్ విడుదల ఏప్రిల్ 9,ఏప్రిల్ 23,ఏప్రిల్ 29 తేదీల్లో ఎన్నికలుమే […]
