కోట్లరూపాయల ప్రజాధనం వృధా

పవిత్ర సంగమం అంటే ఒకప్పుడు సరదాగ కాసేపు కుటుంబసభ్యులతో కలిసి ఆహ్లాదకర వాతావరణంలో గడపడానికి చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి ప్రజలు వచ్చేవారు. ప్రశాంతమైన వాతావరణంలో కాసేపు సేదతీరి సంతోషంగా తిరిగి వెళ్ళేవారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎందుకంటే పవిత్ర సంగమం రోడ్లపై ప్రయాణం నరకప్రాయంగా తయారైంది. అడుగుకో గుంత..గజానికో గొయ్యిగా మారింది ఆ రోడ్ల పరిస్థితి ఇక సాయంత్రం వేళల్లో ఐతే సరిగా వెలిగి వెలగని వీధి దీపాలతో సరైన వెలుతురు లేక ద్విచక్ర వాహనదారులకు చుక్కలు కనపడుతున్నాయి. ఈ రోడ్డుపై ఉన్న గుంతలు లో పడి పలుమర్లు అనేకమంది వాహనదారులు క్షతగాత్రులు కావడం జరిగింది ఐనా కూడా ఈ రహదారి మరమ్మతులు మాత్రం చేయడం లేదు కదా స్థానిక ప్రజా ప్రతినిదులు కానీ సంభందిత అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. గత కొన్ని రోజులలోనే అనేక ఇదే ప్రదేశంలో అనేక ప్రమాదాలు జరిగి ద్విచక్ర వాహనదారులు తీవ్రంగా గాయపడినా కూడా అధికారులలో చలనం కూడా రాలేదు. పవిత్ర సంగమం రోడ్లపై ఎంతోమంది గాయాలపాలైన కూడా రోడ్డు మరమ్మతులు చేయకపోవడం పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయల ప్రజధనాన్ని వెచ్చించి వేసిన ఈ రోడ్డు కొరకు ఇదే ప్రాంతంలో ఎన్నో ఏళ్ల నుండి నివసిస్తున్న వారిని అప్పటికప్పడే ఖాళీ చేయించి మరీ ఈ రోడ్డును వేయడం జరిగింది.ఒకప్పుడు ఎంతో కళకళలాడిన ఈ ప్రాంతం ఇప్పుడు వెలవెల పోతోంది. నిత్యం వందలాది వాహనాలు తిరిగే ఈ రోడ్డు ఇప్పుడు చెత్తాచెదారం వేయడానికి మరియు పెద్ద పెద్ద మట్టి కుప్పలు నడి రోడ్డు పై వేసెందుకు వినియోగిస్తున్నారు.ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి తక్షణమే పవిత్ర సంగమం రోడ్డు మరమ్మతులు చేయాలని ఈ రోడ్డుపై జరిగే ప్రమాదాలను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానిక గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు