త్వరలో డిజిటిల్ హెల్త్ రికార్డులు

digital health records
Spread the love

త్వరలో డిజిటిల్ హెల్త్ రికార్డులు
ప్రజలపై వైద్య ఖర్చుల భారం తగ్గేలా కార్యాచరణ
ప్రివెంటివ్ హెల్త్ విధానాలపై ప్రత్యేక దృష్టి
వైద్యారోగ్య శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు
ప్రజారోగ్యంపై గేట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అత్యున్నతస్థాయి వైద్య సలహా బృందంతో సీఎం తొలి సమావేశం

తెలుగు ట్రాక్,అమరావతి, డిసెంబర్ 16: ప్రజారోగ్య పరిరక్షణకు మెరుగైన విధానాలను అవలంబిస్తూ ప్రజలకు సేవలు అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ మేరకు అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకోవడంతోపాటు… నిపుణుల సలహాలను తీసుకోవాలని సీఎం సూచించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో వైద్యారోగ్య శాఖపై సమీక్షించారు. ఈ మేరకు గేట్స్ ఫౌండేషన్ తో కలిసి వైద్యారోగ్య రంగంలో ప్రభుత్వం అమలు చేస్తోన్న సంజీవని సహా వివిధ ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు చర్చించారు. ఏపీలో మెరుగైన ప్రజారోగ్య నిర్వహణకు గేట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వైద్యారోగ్య రంగంలోని నిపుణులతో కూడిన 10 మంది సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేశారు.అత్యున్నత స్థాయి నిపుణుల సలహా బృందం సభ్యులు వర్చువల్ గా ఈ సమీక్షకు హజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ..”వైద్యారోగ్య రంగంలో వివిధ ప్రమాణాలను అందుకునేలా డబ్ల్యూహెచ్ఓ లాంటి సంస్థలు నిర్దేశించిన అంశాలను అమలు చేస్తున్నాం. ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డులను సంజీవని ప్రాజెక్టు ద్వారా రూపొందిస్తున్నాం. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో కుప్పం, చిత్తూరు జిల్లాల్లో డిజిటల్ నెర్వ్ సెంటర్ ద్వారా ఈ వివరాలను సేకరించి ఇంటిగ్రేట్ చేశాం. రియల్ టైమ్ లోనే వారి వివరాలు తెలుసుకునేలా సంజీవని ప్రాజెక్టు పని చేస్తుంది. వివిధ అంశాల్లో ప్రజలకు సంబంధించిన ఆరోగ్య సమాచారం అందుబాటులో ఉంటుంది.త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రాజెక్టును అమలు చేస్తాం”అని సీఎం చెప్పారు.

వైద్యారోగ్య రంగంలో టెక్నాలజీ వినియోగం

“2047 స్వర్ణాంధ్ర ప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా మేం ప్రయత్నాలు చేస్తున్నాం. ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం యోగాతో పాటు నేచురోపతిని ప్రోత్సహించాల్సి ఉందన్నారు. . ప్రివెంటివ్ వెల్ నెస్, డిజిటల్ ఏఐ ఎనేబుల్డ్ హెల్త్, హెల్త్ ఫైనాన్సింగ్ రిఫార్మ్స్ లాంటి కీలకమైన అంశాలపై దృష్టి పెట్టాలన్నారు. . వైద్యారోగ్య రంగంలో మౌలిక సదుపాయాలు పెద్ద ఎత్తున పెరగాలి. ఏపీలో మెడ్ టెక్ పార్కు ద్వారా అధునాతన వైద్య పరికరాలను రూపొందిస్తున్నామని తెలిపారు. వ్యాధుల బారిన పడి ఆ తర్వాత చికిత్స తీసుకోవడం కంటే..ముందుగానే నియంత్రించేలా ప్రివెంటివ్ విధానాలపై దృష్టి పెట్టాలన్నారు. వైద్యారోగ్య రంగంలో మరింత వినూత్నంగా ప్రాజెక్టులు చేపట్టేందుకు అత్యున్నత స్థాయి నిపుణుల బృందం సలహాలు ఇవ్వాలని కోరారు. ఏడాదిలోగా ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డులను సిద్ధం చేస్తాం. స్క్రీనింగ్ లో టాప్ 10లో ఉన్న రోగాలను గుర్తించి విశ్లేషించేందుకు ప్రయత్నిస్తామన్నారు. . . హెల్తీ,వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. నిపుణుల బృందం విలువైన సలహాలను ఏపీలో అమలు చేస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *