పిఠాపురం లో సంక్రాతి సంబరాలు ప్రారంభం

pitapuram sankranthi sambaraalu
Spread the love

తెలుగు ట్రాక్,పిఠాపురం:
పిఠాపురంలో సంక్రాంతి ఉత్సవాలను ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాల్లో భాగంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాల్స్ లో గర్భిణీలకు శ్రీమంతం, రాధాలపేట అంగాన్ వాడి చిన్నారులపై బోగి పళ్ళుపోసి వారిని ఆశీర్వదించారు.
పిఠాపురం ఆర్ఆర్బీ హెచ్ ఆర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఆయన కళ్యాణ్ సందర్శించారు. వ్యవసాయం, చేనేత జౌలి, మహిళాభివృద్ధి శిశు సంక్షేమం , లేపాక్షి హ్యాండ్ క్రాఫ్ట్, పశుసంవర్థక, పర్యాటక శాఖలకు చెందిన స్టాల్స్ ను పవన్ పరిశీలించారు. నియోజకవర్గంలో సుమారు రూ.211 కోట్లకు విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.
కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రులు పి. నారాయణ,నాదెండ్ల మనోహర్ కందుల దుర్గేష్,శాసనసభ్యులు పంతం నానాజి, ప్రభుత్వ విప్ పి.హరిప్రసాద్, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ,డి సిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి,సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్,మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ ఎన్ వి వర్మ,జిల్లా ఇంచార్జి కలెక్టర్ అపూర్వ భరత్,జిల్లా ఎస్పీ బిందు మాధవ్,డి ఆర్ వో జె.వెంకటరావు,పలువురు ప్రజాప్రనిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *