ప్రజాభీష్టానికే ఆమోదం

TELUGU TRACK
Spread the love

17 జిల్లాల్లో కొన్ని మార్పులు చేసినట్లు వెల్లడి
సాంఘిక సంక్షేమ శాఖలో రుణ గ్రహీతలకు ఉపశమనం
ప్రభుత్వ కార్యాలయాల్లో స్మార్ట్‌ విూటర్ల ఏర్పాటు
రాజముద్రతో 21.8 లక్షల పాస్‌బుక్‌లు పంపిణీ
కేబినేట్‌ నిర్ణయాలను వెల్లడించిన మంత్రులు
తెలుగు ట్రాక్,అమరావతి,డిసెంబర్‌ 29: ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు జిల్లాల ఏర్పాటులో మార్పులు, చేర్పులు చేసినట్లు మంత్రులు తెలిపారు.క్యాబినెట్‌లో 24 అంశాలను చర్చించి ఆమోదం తెలిపినట్లు ఆంధ్రప్రదేశ్‌ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు. రాష్ట్ర క్యాబినెట్‌ నిర్ణయాలను మంత్రులు నాదెండ్ల మనోహర్‌, సత్యకుమార్‌తో కలిసి అనగాని వెల్లడిరచారు. సాంఘిక సంక్షేమ శాఖలో రుణాలు తీసుకున్న వారికి ఉపశమనం కల్పించామన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో స్మార్ట్‌ విూటర్ల ఏర్పాటును ఆమోదించామన్నారు. 9 జిల్లాల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదని.. 17 జిల్లాల్లో కొన్ని మార్పులు చేసినట్లు వెల్లడిరచారు. ప్రజల కోరిక మేరకు డివిజన్లు, మండలాలు మార్చామన్నారు. గత ప్రభుత్వం సరిగా ఆలోచించకుండా జిల్లాల విభజన చేసిందని విమర్శించారు. గతంలో పారదర్శకంగా చేసుంటే ఈ సమస్యలు వచ్చేవి కావని మంత్రులు నాదెండ్ల, సత్యకుమార్‌ వ్యాఖ్యానించారు. గ్రేటర్‌ విజయవాడ, గ్రేటర్‌ తిరుపతి ప్రతిపాదనలు ఉన్నాయి. గ్రేటర్‌ సిటీలుగా అభివృద్ధి చేస్తామని సీఎం అన్నారు. రాజముద్రతో 21.8 లక్షల పాస్‌బుక్‌లు పంపిణీ చేస్తున్నాం. జవనరి 9లోగా పాస్‌బుక్‌ల పంపిణీ పూర్తి చేస్తాం. తప్పులు సరిచేశాకే పాస్‌బుక్‌లు ఇవ్వాలని ఆదేశించాం. పాస్‌బుక్‌లపై గత పాలకుల ఫొటోలు తొలగించాం. పోలవరం పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. రాయచోటిని మరింత అభివృద్ధి చేసేందుకు సీఎం హావిూ ఇచ్చారు. మంత్రి మండిపల్లిని పిలిచి సీఎం చంద్రబాబు ఓదార్చారు. పరిపాలనా సౌలభ్యం కోసం నిర్ణయాలు తీసుకున్నాం అని మంత్రి అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు. అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి మార్పుపై మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురవడం చర్చనీయాంశంగా మారింది. వెంటనే రంగంలోకి దిగిన సీఎం చంద్రబాబు మంత్రితో మాట్లాడారు. అలాగే రాయచోటి నియోజకవర్గాన్ని జిల్లా స్థాయి అభివృద్ధికి కేంద్రంగా తీర్చిదిద్దుతామని హావిూ ఇవ్వడం జరిగింది. రాయచోటి మార్పు వ్యహారంపై మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి చాలా బాధపడుతున్నారని తెలిపారు. అందుకే ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగి మంత్రిమండలి తరవాత కూడా రాంప్రసాద్‌ రెడ్డిని పిలిచారన్నారు. ఆయన్ను ఓదార్చినట్లు తెలిపారు. రాయచోటిని అన్నివిధాలా అభివృద్ధి చేస్తామని సీఎం చెప్పారని అన్నారు. ఆయనకు మెడికల్‌ కాలేజీ కావాలా?.. ఇంకేం ఏమన్నా కావాలా అన్న విషయాన్ని ప్రభుత్వం చూస్తుందని తెలిపారు. అలాగే రాంప్రసాద్‌ రెడ్డి రాజీనామా లాంటి హెస్టీ డెసిషన్‌లాంటివి తీసుకోరన్నారు. ఆయనకు కూడా తమ ప్రాంత అభివృద్ధి ముఖ్యం అని భావిస్తారని మంత్రి స్పష్టం చేశారు. అన్నమయ్య ఎక్కడ జన్మించినా శ్రీవారి సేవలో ఉన్నారని తెలిపారు. అన్నమయ్యకు ప్రాంతాలు ఉండవని… గతంలో కూడా కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్‌ జన్మిస్తే ఎన్టీఆర్‌ జిల్లా ఏర్పాటు చేసి పెట్టారని మంత్రి అనగాని గుర్తుచేశారు. పరిపాలనా సౌలభ్యం కోసమే రాయచోటి నుంచి మదనపల్లికి మార్చారని మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. కూటమి కేంద్రం సహకారంతో ప్రభుత్వంలో చేస్తున్న అనేక కార్యక్రమాలను కేబినెట్‌ చివరన సీఎం తెలిపారన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *