మహిళలకు రక్షణకు పెద్దపీట
మత్తు పదార్దాల రవాణా, సెల్‌ఫోన్లు రికవరీలో పురోగతి
సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల అదుపునకు కృషి
2025 వార్షిక నేర నివేదిక విడుదలలో డిజిపి హరీష్ కుమార్ గుప్తా
తెలుగు ట్రాక్,అమరావతి,డిసెంబర్29: గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏపీలో కైర్ర రేటు బాగా తగ్గిందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. పోలీస్ శాఖ తీసుకున్న నిర్ణయాల వల్ల నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. 2025 సంవత్సరానికి గాను వార్షిక నేర నివేదికను సోమవారం ఏపీ డీజీపీ విడుదల చేశారు. ఈ సందర్భంగా విూడియాతో మాట్లాడుతూ.. మహిళలకు రక్షణ, మత్తు పదార్దాల రవాణా, సెల్‌ఫోన్లు రికవరీ వంటి అనేక వాటిలో మంచి పురోగతి సాధించామని చెప్పుకొచ్చారు. నిరంతరం సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఈ నేరాలను మరింత తగ్గించేలా నూతన ఏడాదిలో పోలీసులు పని చేస్తారన్నారు. వచ్చే పదేళ్లల్లో పోలీసింగ్ ఎలా ఉంటుందనే దానిపై వర్క్‌షాపు నిర్వహిస్తున్నామని అన్నారు. పోలీసు విధుల్లో వచ్చిన మార్పులు, సాంకేతిక పరిజ్ఞానం, ఎలా అందిపుచ్చుకోవాలో వివరిస్తామని తెలిపారు. సంక్రాంతి పండుగ తర్వాత ఈ వర్క్‌షాపు ఉంటుందని వెల్లడిరచారు. అలాగే ఇటీవల కీలక కేసులను కూడా ప్రస్తావిస్తూ.. ఎలా చేధించారో వివరిస్తామని తెలిపారు. సరికొత్త పోలీసింగ్ కనిపించేలా ఈ వర్క్‌షాపు ద్వారా అందరికీ తెలియచేస్తామన్నారు. అప్పా ఒక్కటే మనకు పెండిరగ్‌లో ఉందని.. దానిపై త్వరలోనే ప్రకటన వస్తుందని తెలిపారు. చట్టానికి అందరూ సమానమే అని.. వ్యతిరేకంగా వెళ్లేవారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇందులో విజయం, అపజయం ఉండదని.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వారిపై చర్యలు తీసుకోవమే తమ విధి అని స్పష్టం చేశారు. సేఫ్ ఏరియా అనుకుని కొంతమంది నక్సలైట్లు ఏపీలోకి వచ్చారని.. కానీ ఎప్పటికప్పుడు తాము నిఘా ఉంచి వారందరినీ పట్టుకున్నామన్నారు. సైబర్ నేరాలకు సంబంధించి చైనాలో పెద్ద గ్యాంగ్స్ ఉన్నాయని తెలిపారు. మోసం జరిగిన వెంటనే ఆ దేశానికి నగదు వెళ్లిపోతుందని చెప్పారు. అందుకే ఇటువంటి కేసులలో నగదు వాపస్ అనేది చాలా కష్టమైన పని అని తెలియజేశారు. ఇటువంటి మోసాల పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేంద్రం ఇచ్చిన నివేదిక ప్రకారం 36వ స్థానంలో ఏపీ ఉందనే వార్తలు వాస్తవం కాదని తేల్చిచెప్పారు. అది పాత సిస్టమ్ అని.. మన డేటాకు, వారి డేటాకు మధ్య ఉన్న తేడా వల్ల అలా వచ్చిందన్నారు. అప్పుడు వారి డ్యాష్ బోర్డులో తప్పు ఉందని తాము వారికి లేఖ రాశామని అన్నారు. ఇప్పుడు చూడండి.. డ్యాష్ బోర్డులో ఏపీ ఎక్కడ ఉందో తెలుస్తుందని తెలిపారు.
ఎపిలో తగ్గిన కైమ్ర్ రేటు
