
టీడీపీ తో పొత్తు ఖచ్చితంగా ఉంటుంది.
2024 ఎన్నికల్లో టీడీపీ తో కలిసే పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తాము ఇప్పటివరకు ఎన్ డి ఏ లో భాగస్వామ్య పక్షం గానే ఉన్నామని అయితే టీడీపీ తో కలిసి వచ్చే అంశం పై బీజేపీ నిర్ణయం ఏదైనా కానీ తాము మాత్రం టీడీపీ తో పొత్తు నిరన్యం తీసుకున్నామని వెల్లడించారు. గురువారం నాడు పవన్ కళ్యాణ్ రాజమండ్రిలోని జైలులో చంద్రబాబును కలిసిన అనంతరం మీడియా తో మాట్లాడారు. బాలకృష్ణ,లోకేష్ లతో కలిసి జైలు బయట మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టీడీపీ తో కలిసి పోటీ చేసి వైసీపీ అరాచక పాలనకు చరమ గీతం పాడుతామని ధీమా వ్యక్తం చేశారు. రేపటి నుండి టీడీపీ,జనసేన కలిసి కార్యాచరణపై నిర్ణయిస్తామని తెలిపారు.