
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గురువారం 1:04 నిముషాలకు ప్రమాణ స్వీకారం చేశారు .గవర్నర్ తమిళ్ సై అయన చేత ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. రేవంత్ తో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ శ్వీకారం తర్వాత రేవంత్ ప్రసంగించారు. గత ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారని ఆ పరిస్థితి తెలెత్తకుండా ఎల్లపుడూ ప్రజలకు అందుబాటులోనే ఉంటామని ప్రకటించారు. అందుకు అనుగుణంగా ప్రజలకు అడ్డుగా ఉన్న ప్రగతి భవన్ ఇనుప కంచెలను కూల్చేశామని ప్రకటించారు. ఉదయం ప్రమాణ శ్వీకారం ప్రారంభం అయ్యే సమయానికి బొల్లోజర్ లతో ప్రగతి భవన్ దగ్గర బారికేడ్లను కూల్చేశారు. శుక్రవారం ఉదయం ప్రజల కోసమా ప్రజా దర్బార్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.