విద్యుత్ వినియోగంపై ప్రజలలో మార్పు తీసుకువద్దాం
విద్యుత్ పొదుపు ద్వారా పర్యావరణాన్ని కాపాడుదాం
జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు.

విచక్షణారహితంగా విద్యుత్ను వృదా చేయడం ద్వారా భవిషత్ అందకారం అవుతుందని, విద్యుత్ పొదుపుపై ప్రజలలో అవగాహన తీసుకువచ్చి వనరులను సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు.
జాతీయ ఇంధన పొదుపు వారోత్సవంలో భాగంగా రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్, ఇంధన శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ విద్యుత్ను పొదుపు చేయడం ద్వారా భవిషత్ తరాలకు భరోసా కల్పించాల్సిన భాధ్యత అందరిపైన ఉందన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సుఖజీవనానికి అలవాటు పడి విద్యుత్ పొదుపును నిర్లక్ష్యం చేస్తున్నారని, విద్యుత్ వాడకం, ఆదాపై ప్రతి ఒక్కరూ ఆత్మవిమర్శన చేసుకున్నప్పుడే సత్ఫలితాలు ఉంటాయన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం నీరు, విద్యుత్ సంరక్షణ ప్రధాన అంశాలుగా ఉ న్నాయని, విచక్షణారహిత విద్యుత్ వాడకంతో భవిషత్ సంఘర్షణలు జరిగే ప్రమాదం ఉందన్నారు. ఉత్పత్తి చేసిన విద్యుత్ను నిల్వ చేసుకునే అవకాశం లేనందున అవసరాల మేరకు విద్యుత్ను ఉత్పత్త చేసుకోవడం ద్వారా వనరులను సంరక్షించుకోవచ్చునన్నారు. మన ఇంటి నుండే విద్యుత్ పొదుపును ప్రారంభించిన్నప్పుడే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చునన్నారు. ముఖ్యంగా విద్యుత్ విలువ గురించి ప్రజలకు తెలియజేసి వృదా చేయకుండా పొదుపు చేసుకునేలా విద్యుత్ను అవసరాలకు సరిపడినంత మాత్రమే వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విద్యుత్ పొదుపు ద్వారానే భవిష్యతుకు వెలుగును ఇవ్వగలుగుతామన్నారు. విద్యుత్ వినియోగంపై స్థిరత్వం ఏర్పడితే పరిరక్షనకు మార్గం సుగమం అవుతుందన్నారు. విద్యార్థి దశ నుండే విద్యుత్ వినియోగంపై అవగాహన కలిగివుండాలన్నారు. ముఖ్యంగా విద్యార్థులు విద్యుత్ పొదుపు పై ప్రతి రోజు చర్చించుకుని అచరణలో పెటుకోవాలన్నారు. సహజంగా ఫ్యాన్లు, ఫ్రిడ్జ్లు, టీవీలు, కంప్యూటర్లు, ఏసిలు వంటివి వాడకం వలన విద్యుత్ బిల్లులు అధికంగా వస్తుంటాయన్నారు. గృహలలో వినియోగించే ఎయిర్కండీషన్స్, రిఫ్రజిరేటర్స్, వాటర్ గీజర్స్ వాషింగ్ మిషన్, ఫ్యాన్లు, లైట్లు, ఎలక్ట్రిక్ కుక్కర్లు వంటి పరికరాలను వినియోగించేటప్పుడు పొదుపు చిట్కాలను పాటించాలన్నారు. పగటిపూట వీలైనంత సమయం విద్యుత్ లైట్ల వినియోగాన్ని తగ్గించాలని రాత్రి సమయంలో సాధ్యమైనంత త్వరలో దినచర్యలను ముగించుకుని విద్యుత్ వాడకాన్ని తగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విద్యుత్ పొదుపు చేసేందుకు ఎల్ డీ బల్పులను వినియోగించుకోవాలన్నారు. అవసరం లేన్నప్పుడు లైట్లు, ఫ్యాన్లుల తప్పనిసరిగా ఆపివేయాలన్నారు. విద్యుత్ను పొదుపు చేయడమంటే ధనాన్ని ఆదా చేయడమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. పాత ట్రాన్స్ఫార్మర్స్, ఫీడర్స్, విద్యుత్ లైన్లను మార్చడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి, సరఫరా సమానంగా ఉ ంటుందన్నారు. ప్రతి ఒక్కరూ విద్యుత్ పొదుపును పాటించడం ద్వారా ఇంధనాన్ని పొదుపు చేసి బావితారలకు వెలుగును ఇచ్చేవారవుతామని కలెక్టర్ డిల్లీరావు అన్నారు.

ఏపిసిపిడిసిఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జె. పద్మా జనార్ధనరెడ్డి మాట్లాడుతూ విద్యుత్ లేకుండా ఒక గంట కూడా ఉండలేని పరిస్థితిని ఉహించలేమన్నారు. విద్యుత్ వాడకం పొదుపు అందరి బాధ్యతగా గుర్తించాలన్నారు. నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేసేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామని దీనిలో భాగంగా 25 సంవత్సరాల పై బడిన ట్రాన్స్ ఫార్మర్స్, ఫీడర్స్, రెగ్యులేటర్లు, విద్యుత్ లైన్లను 4వేల కోట్ల రూపాయల ఖర్చుతో మార్చే కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు, దీని వల్ల ఉత్పత్తి సరఫరాలో ఉన్న 8.05 నష్టాన్ని తగ్గించగలిగామని అన్నారు. బ్యూరో ఆఫ్ ఎనీర్ణ ఎఫిషియెన్సీ యాక్ట్ ప్రకారం ఇంధన పొదుపును పాటించేలా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలన్నారు.
జాయింట్ కలెక్టర్ డా. పి. సంపత్ కుమార్ మాట్లాడుతూ ఇంధన పొదుపును వారం రోజుల పాటే కాకుండా 365 రోజులు పాటించాలన్నారు. నేటి తరం విద్యుత్ను పొదుపు చేయడం ద్వారా భవిష్యత్ తరాలు అందకారం నుండి రక్షించగలుగుతామన్నారు. నేడు ప్రతి వస్తువు విద్యుత్ పై ఆధారపడి ఉంటుందని ప్రతి ఒక్కరు గుర్తించాలన్నారు. అవసరాలకు మించి ఎక్కువ విద్యుత్ వినియోగంతో ఉత్పత్తి అధికమై గ్యాస్, బొగ్గు, క్రూడ్ ఆయిల్ వంటి సహజ వనరులు తరిగిపోయే ప్రమాదం ఉందన్నారు. ప్రతి విద్యార్థి తమ కుటుంబ సభ్యులతో విద్యుత్ పొదుపుపై అవగాహన కల్పించాలని సూచించారు.
ఏపి ట్రాన్స్కో విజిలెన్స్ సెక్యూరిటీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ బి. మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజుల పాటు ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. విద్యుత్ పొదుపు పాటించడం ద్వారా 5 వేల 6 వందల మిలియన్ యూనిట్లు ఆదా చేశామని భవిష్యత్లో 17 వేల మిలియన్ యూనిట్లు ఆదా లక్ష్యంగా నిర్ణయించుకున్నామన్నారు.
అనంతరం ఇంధన పొదుపు పై అవగాహన కల్పించే వాల్ పోస్టర్లను కరపత్రాలను విడుదల చేశారు. కార్యక్రమంలో ఏవి ఇఆర్సి ఎడ్వయిజరీ కమిటీ మెంబర్ లక్ష్మిభీమేష్, ఎపిసిపిడిసిఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎ. మురళి కృష్ణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు బి.వి సుధాకర్, జి.బి శ్రీనివాసరావు, డిప్యూటి ఇ ఇ యు. శ్రీనివాస్, ఇంధన పరిరక్షణ మిషన్ అధికారులు వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.