
ఎట్టకేలకు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ ఒక దారిలోకి వస్తుంది.సీనియర్ నేతలందరూ కాంగ్రెస్ లోకి రావడం,పోటీ చేసేందుకు అందరు దాదాపు ఒకే స్తానం మీద కన్నేయడంతో ఎలా సర్దుబాటు చేస్తారో అన్న కార్యకర్తల ఉత్కంఠకు అధిష్టానం తెరదింపింది. అన్ని సర్వేలు కాంగ్రెస్ కు అనుకూలంగా రావడంతో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ కూడా పావులు కదుపుతుంది. ప్రధానంగా పాలేరు సీటు నుండి తుమ్మల,పొంగులేటి ఇద్దరు పోటీచేసేందుకు ఆసక్తి చూపించారు.గతంలో ఇద్దరు అదే స్తానం నుండి పోటీచేసినవారు కావటం,వారి కార్యకర్తలు కూడా అదే స్తానం పైన అసలు పెట్టుకోవడంతో ఇద్దరూ పాలేరు కోసం పట్టు బట్టారు. ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగి ఇద్దరితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇరువురికి రాజీ కుదిర్చి ఖమ్మం నుండి తుమ్మల నాగేశ్వర రావు,పాలేరు నుండి పొంగులేటిని పోటీ చేసేందుకు ఒప్పించారు.